తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ వైద్యఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అడుగులు బీజేపీ వైపే పడుతున్నాయి. కొద్దిరోజులుగా తర్జనబర్జనలు, తెలంగాణలోని నేతలందరితో వరుస భేటీల తర్వాత ఈటల రాజీనామాతేదీని.. బీజేపీలో చేరే తేదీని ఖాయం చేసుకున్నారు.
ఈటల రాజేందర్ జూన్ 4న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. జూన్ 8 లేదా 9 తేదీలలో బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ చీఫ్ జెపి నడ్డాను కలిసిన తరువాత ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన ఈటల శుక్రవారం మీడియా సమావేశంలో ప్రసంగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్య విషయం ఏమిటంటే, ఐదు నుంచి ఆరుగురు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా టీఆర్ఎస్ ను వదిలి ఈటలతో పాటు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.
ఈటలా వివిధ స్థాయిలలో జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో సవివరమైన చర్చలు జరిపినట్లు తెలిసింది. తన భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈటల కలిసిన నాయకులలో పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ఉన్నారు. అతను గత నాలుగు రోజులుగా ఢిల్లీలో బీజేపీ తరుఫున కీలకంగా ఉన్నాడు.
మంత్రిత్వ శాఖ నుంచి తొలగించబడిన ఈటల టిఆర్ఎస్ అదిష్గానంపై తిరుగుబాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సహా తెలంగాణలోని పలువురు నాయకులతో ఆయన చర్చలు జరిపారు. ప్రొఫెసర్ కోదండ రామ్, చెరుకూరి సుధాకర్ వంటి నాయకులు కూడా ఆయనను కలిశారు. చాలా చర్చల తరువాత ఆయన బీజేపీలో చేరడానికే నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం ఈటల తను టీఆర్ఎస్ తరుఫున గెలిచిన హుజూరాబాద్ ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారట.. ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున నిలబడి ఈటల పోటీ చేయాలని డిసైడ్ అయ్యాడట.. ఆయన భార్య జమునా రెడ్డిని ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపాదనకు యోచిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. టిఆర్‌ఎస్‌కు తన బలాన్ని నిరూపించుకోవాలని, టీఆర్‌ఎస్ నాయకత్వానికి ప్రత్యామ్నాయమని చూపించాలని ఈటల పట్టుదలతో ఉన్నారట.. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి శుక్రవారం రాజీనామా చేసి.. జూన్ 8న బీజేపీలో చేరి పోటీచేసి గెలవాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది.