దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత బీజేపీలో నూతనోత్సాహం పెరిగింది. తరువాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. నాయకుడు లేని కాంగ్రెస్ పార్టీ స్కోర్ కార్డు ఓపెన్ చేయలేకపోయింది. దీంతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమేనంటూ బీజేపీ జబ్బలు చరుస్తోంది. ఈ దశలో ఈటల వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా తయారయింది.
టీపీసీసీకి అధ్యక్షుడిని నియమిస్తే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పీసీసీ పీఠంపై కాంగ్రెస్ లో చాలా మంది పోటీ పడుతున్నారు. ేవంత్ ెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్, మధుయాష్కీ గౌడ్ తదితరులు పోటీలో ఉన్నారు. దీంతో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. కష్ట కాలంలో పీసీసీని గట్టెక్కించేందుకు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.
హుజురాబాద్ ఉప ఎన్నిక ముందుండడంతో పీసీసీ చీఫ్ పదవి ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. కాంగ్రెస్ నేతలు చేజారకుండా ఉండాలంటే అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చిన పీసీసీ పీఠంపై ఎవరినో ఒకరిని కూర్చో బెట్టాలని యోచిస్తోంది. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై స్పష్టత రావడం లేదు. దీంతో ఏఐసీసీ దయ ఎవరిమీద ఉంటుందోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.