https://oktelugu.com/

ఈటలకు కేసీఆర్ ను ఢీకొనే బలముందా?

హుజురాబాద్ ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసి సొంత ఊరికి వచ్చిన ఈటలకు ఆయన మద్దతు దారులు ఘన స్వాగతం పలికారు. హుజురాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉన్నా వరంగల్ జిల్లాలో ఆయనకు మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉన్నారు. దీంతో రాజకీయ వేడి పెరుగుతుందని చెప్పకతప్పదు. అధికార పార్టీ సైతం అదే దూకుడుతో హుజురాబాద్ లో విజయం కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఏవైనా విజయం మాదే అని టీఆర్ఎస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2021 / 08:48 AM IST
    Follow us on

    హుజురాబాద్ ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసి సొంత ఊరికి వచ్చిన ఈటలకు ఆయన మద్దతు దారులు ఘన స్వాగతం పలికారు. హుజురాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉన్నా వరంగల్ జిల్లాలో ఆయనకు మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉన్నారు. దీంతో రాజకీయ వేడి పెరుగుతుందని చెప్పకతప్పదు. అధికార పార్టీ సైతం అదే దూకుడుతో హుజురాబాద్ లో విజయం కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

    ఎన్నికలు ఏవైనా విజయం మాదే అని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని నేతగా చెప్పుకుంటున్నారు. జనాల్లో వ్యతిరేకత వచ్చిందని ప్రచారం జరుగుతున్నాప్రజలు టీఆర్ఎస్ నే ఆరాదించడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు లేకపోవడంతోనే టీఆర్ఎస్ కు తిరుగులేకుండా పోతోందని సమాచారం. అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులు పనిచేస్తున్నారని తెలుస్తోంది.

    హుజురాబాద్ లో బీజేపీకి బలం లేదనే చెప్పాలి. దీంతో ఈటల సొంత ఇమేజ్ తోనే పోటీకి దిగుతారని ప్రచారం సాగుతోంది. రాజేందర్ కు హుజురాబాద్ లో కార్యకర్తలు బాగా ఉన్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక జరగడానికి ఇంకా సమయం ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ర్టాల ఎన్నికలతో పాటే హుజురాబాద్ ఎన్నిక జరుపుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సమయం ఉన్నందున పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

    హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం గులాబీ బాస్ సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. ఈటల రాజేందర్ సైతం అంతే కసితో విజయడంకా మోగించాలని భావిస్తున్నారు. గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈటలను ఢీకొనే నాయకుడి కోసం అన్వేషణ సాగిస్తున్నారు.