కరోనా నుంచి కోలుకున్నారా.. ఆ పని చేస్తే ప్రమాదం..?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గత కొన్నిరోజులుగా లక్షలోపే కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత, వైరస్ నుంచి కోలుకున్న తరువాత చాలామంది వ్యాయామాలు చేస్తున్నారు. కొంతమంది కిలోమీటర్ల కొద్దీ నడుస్తుంటే మరికొందరు జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. అయితే కరోనా సోకిన వాళ్లు, వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు వ్యాయామం చేయకపోతే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించకుండా వ్యాయామం చేస్తే […]

Written By: Navya, Updated On : June 10, 2021 9:49 am
Follow us on

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గత కొన్నిరోజులుగా లక్షలోపే కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత, వైరస్ నుంచి కోలుకున్న తరువాత చాలామంది వ్యాయామాలు చేస్తున్నారు. కొంతమంది కిలోమీటర్ల కొద్దీ నడుస్తుంటే మరికొందరు జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. అయితే కరోనా సోకిన వాళ్లు, వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు వ్యాయామం చేయకపోతే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైద్యుల సలహాలు, సూచనలు పాటించకుండా వ్యాయామం చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వ్యాయామాలు చేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే కరోనా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు కొంతకాలం మానసిక విశ్రాంతి పొంది ఆ తర్వాత వ్యాయామం చేసే సమయం పెంచుకుంటూ వెళితే మంచిది.

అలా కాకుండా కరోనా నుంచి కోలుకున్న తర్వాత కఠిన వ్యాయామాలు చేస్తే మాత్రం ప్రాణాలకే ముప్పు అని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత వ్యాయామాలు చేస్తే జరిగే మేలు కంటే అనర్థాలే ఎక్కువని చెప్పాలి. వ్యాయామాలు చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి కొత్త సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కొంత సమయమైనా వ్యాయామం చేసేవాళ్లు పల్స్ ఆక్సీమీటర్ తో ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి.

ఆయాసం వచ్చినా, ఛాతీ నొప్పి, గుండె నొప్పి వచ్చినా వ్యాయామం నిలిపివేస్తే మంచిది. నిస్సత్తువ, నీరసం ఉన్న సమయంలో వ్యాయామం చేయకూడదు. పలు దేశాల్లో అథ్లెట్లు కరోనా నుంచి కోలుకున్న తరువాత చనిపోయిన సందర్భాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.