జూలై 23 డెడ్ లైన్: విశాఖ నుంచే ఏపీ పాలన?

ఏపీ సీఎం జగన్ రాజకీయాలను షేక్ చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. టీడీపీ సహా ప్రతిపక్షాలు అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా విశాఖకు రాజధానిని మార్చాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంకు కార్యనిర్వాహక రాజధానిని మార్చడానికి చర్యలు చేపట్టారని పుకార్లు వస్తున్నాయి. దాదాపు ఏడాది క్రితం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలని నిర్ణయించినప్పటికీ చట్టపరమైన అడ్డంకులు సహా వివిధ సమస్యల కారణంగా ఇది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. […]

Written By: NARESH, Updated On : June 10, 2021 8:51 am
Follow us on

ఏపీ సీఎం జగన్ రాజకీయాలను షేక్ చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. టీడీపీ సహా ప్రతిపక్షాలు అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా విశాఖకు రాజధానిని మార్చాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంకు కార్యనిర్వాహక రాజధానిని మార్చడానికి చర్యలు చేపట్టారని పుకార్లు వస్తున్నాయి.

దాదాపు ఏడాది క్రితం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలని నిర్ణయించినప్పటికీ చట్టపరమైన అడ్డంకులు సహా వివిధ సమస్యల కారణంగా ఇది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ఓడరేవు నగరం నుండి రాష్ట్ర పరిపాలన పనిచేయడం కోసం విశాఖపట్నం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యమంత్రి, గవర్నర్ లు ఇద్దరూ ఈ నగరానికి వస్తే విశాఖ రేంజ్ జాతీయస్థాయికి ఎదుగుతుందని.. ఇది రియల్ ఎస్టేట్.. ఇతర రంగాలకు ఊపునిస్తుందని అంటున్నారు. త్వరలోనే విశాఖ రాజధాని అవుతుందని వివిధ వర్గాల ఆశావాదులు, అధికార పార్టీ అగ్ర నాయకుల ప్రకటనలు మరింత అంచనాలు పెంచేస్తున్నాయి.

విశాఖపట్నం నుంచి పరిపాలన త్వరలో ప్రారంభమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల పునరుద్ఘాటించారు. ఈ ఊహాగానాలు, పుకార్లు, ప్రజల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయని అంటున్నారు. జగన్ తాజాగా నిర్ణయంతో ఇక్కడి ప్రజలకు శుభవార్త అందబోతోందని ప్రచారం సాగుతోంది.

జగన్ మోహన్ రెడ్డి జూలై 23న విశాఖపట్నంలో తన క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదో కొత్త పుకారు. జూలై 23న సీఎం జగన్ విశాఖకు రాజధాని మార్చేందుకు తేదీ నిర్ణయించారని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఉక్కు నగర ప్రజలకు దీంతో దశాబ్ధాల కల నెరవేరబోతోందని చెబుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఈ ఓడరేవు నగరం నుండి పనిచేయడం ప్రారంభిస్తారని గత రెండు సంవత్సరాలలో ఇటువంటి అనేక పుకార్లు.. తేదీలు ఉన్నాయి. ఈ కొత్త తేదీ.. కొత్త పుకారు వాస్తవంగా మారుతుందా లేదా పుకారుగానే ఉంటుందా అనేది చూడాలి.