https://oktelugu.com/

Huzuraba By Election: అయిపాయే..! ఈటల గెలిచే.. ‘కమలం’ వికసించే.. ‘గులాబీ’ వాడిపాయే!

Huzuraba By Election:‘గులాబీ’ వాడిపోయింది..‘కమలం’ వికసించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. పైసలకు ప్రజలు అమ్ముడు పోరన్న విషయం మరోసారి రుజువైంది. ప్రజలను నమ్మి ముందుకెళ్లిన ఈటల రాజేందర్ కే పట్టం కట్టారు. ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చినా డబ్బు తీసుకొని మరీ ఈటలను గెలిపించడం విశేషం. ఈ ధోరణి భవిష్యత్ రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యతను ఖచ్చితంగా తగ్గిస్తుందని.. ఎంత డబ్బు పంచినా విశ్వసనీయతకే పట్టం కడుతారన్న వాస్తవాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2021 / 06:27 PM IST
    Follow us on

    Huzuraba By Election:‘గులాబీ’ వాడిపోయింది..‘కమలం’ వికసించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. పైసలకు ప్రజలు అమ్ముడు పోరన్న విషయం మరోసారి రుజువైంది. ప్రజలను నమ్మి ముందుకెళ్లిన ఈటల రాజేందర్ కే పట్టం కట్టారు. ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చినా డబ్బు తీసుకొని మరీ ఈటలను గెలిపించడం విశేషం. ఈ ధోరణి భవిష్యత్ రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యతను ఖచ్చితంగా తగ్గిస్తుందని.. ఎంత డబ్బు పంచినా విశ్వసనీయతకే పట్టం కడుతారన్న వాస్తవాన్ని కళ్లకు గట్టింది.

    etela rajendar

    హుజూరాబాద్ లో కోట్లు కుమ్మరించారు. సీఎం కేసీఆర్ దళితబంధు పేరిట ఇంటికి రూ.10లక్షలు పంచేశారు. పథకాలు, పనులు అభివృద్ధి అంటూ హుజూరాబాద్ ను అద్దంలా తయారు చేశారు. ఇక పోలింగ్ కు ముందు హుజూరాబాద్ ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకు పంచినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కొన్ని వందల కోట్లు హుజూరాబాద్ లో కుమ్మరించారు. ఇంత చేసినా కూడా హుజూరాబాద్ లో ఈటలకే పట్టం కట్టారంటే ఎన్నికల్లో ఇప్పుడు డబ్బులు పంచితే గెలవరన్న వాస్తవం బయటపడింది. ప్రజలు విశ్వసనీయతకే పట్టం కడుతారని రుజువైంది.

    ఇప్పుడు ఈటల గెలుపుతో అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయ్యాయి. దళితబంధు భవిష్యత్ పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఎంతో ఆశలు పెట్టుకొని హుజూరాబాద్ లో ఈటలను ఓడించాలనుకున్న కేసీఆర్ పంతం నెరవేరలేదు. ఈటలను అసెంబ్లీలో చూడవద్దని కోరుకున్న కేసీఆర్ ఆశ తీరలేదు. ఈటల గెలిచాడు. సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నాడు.ఇప్పుడు తనను ఓడించడానికి చూసిన టీఆర్ఎస్ నేతలపై ఓ పట్టు పట్టనున్నాడు.

    హుజూరాబాద్ లో డబ్బుల ప్రవాహం పనిచేయలేదని ఈటల గెలుపుతో అర్థమైంది. ప్రజలు డబ్బులు తీసుకొని మరీ ఈటలకు గుద్దారంటే రాజకీయాల్లో గొప్ప మార్పుగానే చెప్పొచ్చు. మొదటి నుంచి హోరా హోరీగా సాగిన ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ సంకుల చివరకు వచ్చేసరికి ఈటలకు క్లియర్ కట్ మెజార్టీ వచ్చేసింది. హుజూరాబాద్ లో బీజేపీ జెండాను ఈటల సగర్వంగా ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఏకంగా 21వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

    కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఈటల రాజేందర్ ఆధిక్యంలోనే కొనసాగారు. ఒక్క 8వ రౌండ్, 11వ రౌండ్ లో మాత్రమే గెల్లు శ్రీనివాస్ స్వల్ప ఆధిక్యం కనబరిచారు. ఈటల విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి.