KCR Weakness: తెలంగాణలో కేసీఆర్ పాలనకు బీటలు వారనున్నాయా? ఆయన పాలనకు ప్రజలు విసిగిపోయారా? ఇక టీఆర్ఎస్ పాలన వద్దనుకుంటున్నారా? అంటే నిజమే అనే సమాధానాలు వస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఫలితంగా నేతల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పీకే వెల్లడించిన నివేదికలో దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. దీంతో నేతల్లో అయోమయం నెలకొంది. తమ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మండిపడుతున్నారు. ఆయనకు కావాల్సింది నేతలు కాదు బానిసలు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ బలాబలాలు తనకు తెలుసని ఆయనను ఎదుర్కొనే సత్తా తనకు ఉందని ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేసి విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ను ఓడించి రాజకీయంగా దెబ్బ తీయాలనేదే తన వ్యూహమని చెప్పారు. దీంతో కేసీఆర్ ప్రస్థానం ఇక ముగిసినట్లే అని పలువురు చర్చించుకుంటున్నారు.
కేసీఆర్ ఓ నియంత. తన మాట వినని వారిని దూరం పెడతారు. తనను ఓడించడానికి హుజురాబాద్ లో రూ.600 కోట్లు ఖర్చు చేసినా చివరకు అపజయమే మిగిలింది. ప్రజాబలం ముందు డబ్బు ఎంతైనా పని చేయదని గుర్తు చేశారు. ఇంకా తన వర్గానికి పెద్ద పీట వేస్తారు. మంత్రివర్గంలో ముగ్గురు వెల్మలకు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ ఎంత మంది ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సవాలు విసిరారు.

పొంతనలేని హామీలు, ఆచరణ సాధ్యం కాని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దళితబంధు ప్రవేశపెట్టి అందరిలో కొట్లాటలకు కేంద్ర బిందువు అవుతున్నారు. రైతు బంధు పెట్టినా కొందరికి మాత్రం దక్కడం లేదు. దీంతో నైరాశ్యంలో ఉన్న వారు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఇంటికి సాగనంపడం ఖాయమని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా చివరకు చిత్తు కావడం నిజమే అనిపిస్తోంది.
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. దీనికోసమే అన్ని శక్తియుక్తుల్ని ధార పోస్తున్నారు. తెలంగాణ మీద కేంద్రమే ఫోకస్ పెట్టింది. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించి విజయవంతం చేసి నేతల్లో జోష్ నింపారు. వచ్చే ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి టీఆర్ఎస్ ను ఢీకొనాలన్నదే బీజేపీ ఉద్దేశం. దీని కోసమే వారు తాపత్రయపడుతున్నారు. రాష్ర్టంలో కుటుంబ పాలన అంతం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిన బూనారు.
కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించడమే మిగిలి ఉంది. దీని కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ ను కిలోమీటర్ దూరంలో ఏకాకిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పోరులో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని బీజేపీని అధికారంలో కూర్చోబెట్టేందుకే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.