Homeజాతీయ వార్తలుErrabelli Dayakar Rao : ఏందయ్యా ఎర్రబెల్లి.. ఈ ఓవర్‌ యాక్షన్‌

Errabelli Dayakar Rao : ఏందయ్యా ఎర్రబెల్లి.. ఈ ఓవర్‌ యాక్షన్‌

Errabelli Dayakar Rao : అది న్యూఢిల్లీ, వేదిక పై ఉన్నది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశంలో ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇస్తున్నారు. ఇంతలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏపూరును ఉత్తమ పంచాయతీగా కేంద్రం నిర్ణయించిందని, సంబంధిత సర్పంచ్‌ అవార్డు తీసుకోవాలని మైక్‌లో ప్రకటించారు. అవార్డు ఇచ్చేందుకు రాష్ట్రపతి వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. ఈలోగా తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముందుగా వేదిక మీదకు వచ్చారు. పురస్కారం తీసుకునేందుకు చేతులు ముందుకు చాచగా రాష్ట్రపతి వారించారు. సంబంధిత సర్పంచ్‌ ఎక్కడ అని ప్రశ్నించగా వెంటనే తేరుకున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు సర్పంచ్‌ సానబోయిన రజితను ముందకు రమ్మని పిలవగా, ఆమె రాష్ట్రపతి ముందుకు వచ్చారు. అనంతరం రాష్ట్రపతి ఆమెకు పురస్కారం అందించారు. ఇదంతా చూసిన నెటిజన్లు ఏందయ్యా ఎర్రబెల్లి.. ఈ ఓవర్‌ యాక్షన్‌ అంటూ చురకలు అంటిస్తున్నారు.

వాస్తవానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు వివాదాస్పద పనులు చేయడం ఇది కొత్తేం కాదు. ఆ మధ్య పట్టణ ప్రగతి కార్యక్రమంలో తలాతోకా లేకుండా మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ జిల్లా స్థాయి అధికారిని అందునా ఓ మహిళను పట్టుకుని ‘నువ్వు బాగానే పని చేస్తవని మావొళ్లు అంటే తీసుకొచ్చిన. ఇంతకు ముందు పని చేసిన కాడ బాగనే ఊపినవట. కానే ఇక్కన్నే సరిగ్గ ఊపుతలేవు’ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ వేదిక మీద ఉన్న వారంతా ఘోల్లున నవ్వారు. కానీ ఆ మహిళా అధికారి ఇబ్బందిపడ్డారు. తర్వాత కన్నీటి పర్యంతమయ్యారు. కానీ దీనిపై ఏ ఉద్యోగం సంఘం నాయకులు కూడా ధర్నాలు చేయలేదు. మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అదే బీజేపీ నాయకులు చేస్తే ఊరుకునేవారా? ఏకంగా మహిళా కమిషన్‌ దాకా వెళ్లేవారు. అధికార పార్టీకి సలాం చేస్తున్నారు కాబట్టి ఏమీ అనలేరు. పైగా నేతల సిఫారసు ద్వారా కోరుకుంటున్న చోటుకు బదిలీలు చేయించుకుంటున్నారు కాబట్టి వారు కిక్కురుమనలేరు.

ఇక గ్రామపంచాయతీ జూనియర్‌ కార్యదర్శులు విష యంలోనూ ఎర్రబెల్లి దయాకర్‌రావు నోరు పారేసుకున్నారు. ప్రొహిబిషన్‌ పూర్తయిన సందర్భంగా తమను రెగ్యులరైజ్‌ చేయమని వారు అడిగితే మీకేం తక్కువయిందని నానా మాటలు అన్నాడు. దీంతో వారు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక కేంద్రంపై ప్రతీసారి నోరు పారేసుకునే ఎర్రబెల్లి దయాకర్‌రావు.. వివిధ పనులు చేసిన సర్పంచ్‌లకు బిల్లులు చెల్లింపులో మాత్రం అంత చొరవ చూపడం లేదు. సాక్షాత్తూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో ఎంతో మంతి సర్పంచ్‌లు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. బిల్లులు రాకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. సర్కారు నుంచి బిల్లులు వసూలు చేయించే సోయి మాత్రం సదరు మంత్రికి లేదు. కేంద్రం అవార్డులు ఇస్తే నవ్వుతూ తీసుకుంటారు. పిల్వకున్నా వేదికమీదకు వెళ్తారు. తర్వాత కేంద్రాన్ని తిడతారు. తాజాగా జరిగిన అవార్డుల కార్యక్రమంలోనూ మంత్రి ఇదే ఓవరాయక్షన్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఎర్రబెల్లిని ఏకిపారేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version