Homeజాతీయ వార్తలుEPFO : ఈపీఎఫ్ వో ఖాతాలో ఎంత డబ్బు జమ అయింది? ఇలా ఈజీగా చెక్...

EPFO : ఈపీఎఫ్ వో ఖాతాలో ఎంత డబ్బు జమ అయింది? ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు ?

How to check PF Balance : వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా EPFO ఖాతా ఉంటుంది. దీనిలో ఉద్యోగి ,యజమాని పీఎఫ్ గా బేసిక్ సాలరీలో 12-12 శాతం జమ చేయబడుతుంది. ఈ ఖాతాలో ఎంత డబ్బు జమ చేయబడింది? అందరికీ తెలియకపోవచ్చు. కానీ EPFO ఖాతాలో జమ అయిన డబ్బు గురించి సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈపీఎఫ్ వో ఖాతా బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేయవచ్చో తెలుసుకుందాం.

EPFO పోర్టల్ ద్వారా చెక్ చేయండి
EPFO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ప్రతి ఉద్యోగి PF బ్యాలెన్స్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. దీని కోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
* EPFO వెబ్‌సైట్‌కి వెళ్లాలి
* సర్వీసుల విభాగానికి వెళ్లి, ఎంప్లాయ్ కోసం క్లిక్ చేయండి.
* సభ్యుల పాస్‌బుక్ ఆఫ్షన్ ఎంచుకోవాలి.
* UAN నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
* లాగిన్ అయిన తర్వాత మీ పాస్‌బుక్‌ను చూడవచ్చు, అక్కడ పీఎఫ్ బ్యాలెన్స్ , డిపాజిట్ చేసిన మొత్తం గురించి సమాచారాన్ని పొందుతారు.

SMS ద్వారా ఎలా తెలుసుకోవాలంటే
* UAN నంబర్ యాక్టివేట్ చేయబడితే SMS ద్వారా PF బ్యాలెన్స్ గురించి సమాచారాన్ని కూడా పొందవచ్చు. దీని కొరకు.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి EPFOHO UAN అని టైప్ చేయండి.
* దీన్ని 7738299899 కు పంపండి.
* మీ PF బ్యాలెన్స్ గురించి మీకు SMS ద్వారా సమాచారం అందుతుంది.

మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయండి
* EPFO మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్ తనిఖీ చేసే సౌకర్యాన్ని కూడా అందించింది. దీని కొరకు.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
* కొన్ని సెకన్లలో మీ మొబైల్‌కు PF బ్యాలెన్స్ సమాచారం పంపబడుతుంది.

ఉమాంగ్ యాప్ ద్వారా సమాచారం

మీరు UMANG (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) యాప్ ద్వారా కూడా మీ PF బ్యాలెన్స్ సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు.

* ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
* EPFO ఆఫ్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
* ఎంప్లాయ్ సెంట్రిక్ సర్వీసులపై క్లిక్ చేయండి.
* UAN నంబర్, OTP ని ఎంటర్ చేయాలి.
* ఇక్కడ మీరు మీ PF బ్యాలెన్స్, ఇతర వివరాలను తనిఖీ చేయవచ్చు.

కార్యాలయాన్ని సంప్రదించండి

పైన పేర్కొన్న మార్గాల ద్వారా మీరు సమాచారాన్ని పొందలేకపోతే మీ కంపెనీ హెచ్ ఆర్ ను సంప్రదించవచ్చు. వారు పీఎఫ్ వివరాలను అందిస్తారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular