కరోనా వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో సోకిన కరోనా వైరస్ క్రమంగా 60దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 90వేలకు పైగా కేసులు నమోదు కాగా 3వేలమంది మృత్యువాత పడినట్లు ప్రాథమిక సమాచారం. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. దీంతో ప్రతీఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ క్రికెటర్లను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా భయంతో ఇతర క్రీడాకారులకు షేక్ హ్యండ్ ఇవ్వమని ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.
రెండు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు శ్రీలంకకు వెళుతుంది. అక్కడి ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వబోమని ఇంగ్లండ్ జట్టు పేర్కొంది. షేక్‌హ్యాండ్‌కు బదులుగా ఫస్ట్‌బంప్‌తో విష్ చేస్తామని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ తెలిపాడు. ఫస్ట్‌బంప్ అంటే పిడికిలి బిగించి ఒకరి చేతిని మరొకరు తాకడం. ఇద్దరు క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో దీనిని వాడుతుంటారు.
ఇంగ్లండ్ జట్టు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడానికి కారణం ఉందని తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లు వాంతులు, ఫ్లూజ్వరంతో బాధపడుతున్నారట. దీంతో వైద్య బృందం ఇంగ్లండ్ జట్టుకు పలు సూచనలు చేసింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకూడదని సూచించింది. అలాగే చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించిందట. ఇందులో భాగంగానే ఇంగ్లండ్ జట్టు తాము షేక్‌హ్యాండ్ ఇవ్వబోమని ప్రకటించింది. ఇంగ్లండ్ క్రికెటర్లు తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..