https://oktelugu.com/

Money Makes Many Things: మనీ మేక్స్‌ మెనీ థిగ్స్‌.. బట్టల షాప్‌ ఓనర్‌ ‘ది లెజెండ్‌’!

Money Makes Many Things: డబ్బే లోకం.. డబ్బే అన్నిటికి మూలం.. డబ్బే అన్నిటినీ శాసిస్తుంది.. నేటి సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి కూడా లేదు. మనీ ఉంటే ఏదైనా చేయవచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ బట్టల వ్యాపారి శరవణన్‌. వస్త్రవ్యాపారంలో సంపాదింంచిన డబ్బుతో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో చాలా మంది జనాలు ఇన్ని రోజులు యాడ్స్‌తో హింసించిన శరవణన్‌ ఇక సినిమాలలో ఎలా భరించాలో అంటూ సరదాగా చెప్పుకుంటున్నారు. అసలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2022 / 07:20 PM IST
    Follow us on

    Money Makes Many Things: డబ్బే లోకం.. డబ్బే అన్నిటికి మూలం.. డబ్బే అన్నిటినీ శాసిస్తుంది.. నేటి సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి కూడా లేదు. మనీ ఉంటే ఏదైనా చేయవచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ బట్టల వ్యాపారి శరవణన్‌. వస్త్రవ్యాపారంలో సంపాదింంచిన డబ్బుతో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో చాలా మంది జనాలు ఇన్ని రోజులు యాడ్స్‌తో హింసించిన శరవణన్‌ ఇక సినిమాలలో ఎలా భరించాలో అంటూ సరదాగా చెప్పుకుంటున్నారు.

    Saravanan

    అసలు ఈ శరవణన్‌ ఎవరు?

    శరవణన్‌ పూర్తి పేరు అరుల్‌ శరవణన్‌. ఈయన 1970, జులై 10న చెన్నైలో జన్మించారు. అరుల్‌ శరవణన్‌ కంటే ఒక్క ఏడాది ముందే దేశంలోనే ఎంతో పెద్ద రిటైల్‌ చెనై్న స్టోర్స్‌గా ఎదిగిన శరవణ స్టోర్స్‌ ప్రారంభం అయ్యింది. ఒక కుటుంబం నడుపుతున్న ఇండియాలోనే అతిపెద్ద రిటైల్‌ స్టోర్‌ చెన్నై స్టోర్స్‌ ఇవే. ఒకే ప్రాంతంలో అత్యధిక స్టోర్స్‌ కలిగి.. అధిక మొత్తంలో వ్యాపారం చేస్తున్న స్టోర్‌ కూడా ఇదే. ఒక్క చైన్నైలో వీరికి ఏడు స్టోర్స్‌ ఉన్నాయి.

    తండ్రి చాయ్‌ వాలా..

    అరుల్‌ శరవణన్‌ తండ్రి సెల్వరత్నం శరవణన్‌ నెల్లై జిల్లా నుంచి చైన్నై మారిపోయారు. తొలినాళ్లలో టీ వ్యాపారిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఎంతో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆ తర్వాత శరవణ స్టోర్స్‌ కు ప్రొపైటర్‌గా మారారు. ఆయన సోదరులు యోగ రత్వం, రాజ రత్నం ఈ స్టోర్స్‌లో పార్టనర్స్‌ అయ్యారు. వారు పిల్లలు అంతా కలిసి ఈ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆ తర్వాత అరుల్‌ శరవణన్‌ వారి నుంచి విడిపోయి తన సోదరి భర్త సాయంతో శరవణ సెల్వరత్నం, ది లెజెండ్‌ శరవణ, ది లెజెండ్‌ న్యూ శరవణ పేర్లతో స్టోర్స్‌ ప్రారంభించారు. రికార్డుల ప్రకారం 2017 సంవత్సరంలో వీరి సంస్థ టర్నోవర్‌ 750 మిలియన్‌ డాలర్లు. అందులో వారి ఆదాయం 200 మిలియన్‌ డాలర్లు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత వారి ఆదాయం వివరాలు ఎప్పుడూ వెల్లడించలేదు. ఈ సంస్థలో మొత్తం 10 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.

    మొదటి నుంచి ఆయనపై ట్రోల్స్‌..

    అర్లు శరవణన్‌ మొదటి నుంచి ఆయన మీద ట్రోల్స్‌తో ఫేమస్‌ అయ్యారు. ఆయన చేసే వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆయనే వ్యవహరించేవారు. వారి కమర్షియల్స్‌లో తారలు, సెలబ్రిటీలతో శరవణన్‌ స్టెప్పులేస్తూ దీపావళి యాడ్స్‌ ను చేసేవారు. అలా అర్లు శరవణన్‌ బాగా ఫేమస్‌ అయ్యారు.

    Also Read: Dinesh Karthik: డీకే, మురళీ విజయ్ చీటింగ్ లొల్లి.. మైదానంలో ఫ్యాన్స్ గోల వైరల్

    నటన అంచే పిచ్చి…

    అర్లు శరవణన్‌కు మొదటి నుంచి నటన అంటే ఇష్టం. ఎప్పటికైనా ఒక నటుడు కావాలని కోరుకున్నారంట. ఆ ఆసక్తితోనే తన సంస్థ కమర్షియల్స్‌లో నటించారు. నటనపై తనకున్న మక్కువపై మాట్లాడుతూ.. ‘‘చిన్ననాటి నుంచి నటన, సినిమాలు అంటే ఇష్టం ఉండేది. కానీ, మా జీవన విధానం వేరు, మా వ్యాపారం వేరు. వ్యాపారంలో సక్సెస్‌ అయ్యాను. ఇప్పుడు అవకాశం రావడంతో సినిమా చేశాను. నటను వయసు అడ్డంకి కాకూడదని భావిస్తుంటా’’ అంటూ చెప్పుకొచ్చారు.

    ఇక హీరోగా తెరంగేట్రం..

    ఇన్నాళ్లూ యాడ్స్‌కే పరిమితమైన శరవణన్‌ 5 పదుల వయసు దాటాక ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వేలకోట్లకు అధిపతి అయిన శరవణన్‌ తాను కన్న కల కోసం హీరోగా మారారు. దర్శక ద్వయం జేడీ మరియు జెర్రీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళ ఇండస్ట్రీలోని టాప్‌ టెక్నీషియన్స్‌ ఈయన మూవీకి పని చేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్, పాటలు కూడా ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో తమిళ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు పనిచేశారు.

    ఈనెల 28 రిలీజ్‌..

    శరవణన్‌ హీరోగా నటించి, నిర్మించిన ది లెజెండ్‌ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌటేలా హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో ఎన్వీ.ప్రసాద్‌ ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నారు.

    Also Read: BJP Forms A Committee: ఫిరాయింపులకు ప్రోత్సాహం.. బీజేపీలో ఓ కమిటీ!

    Tags