Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan with Employees: ఉద్యోగులతో పెట్టుకొని సీఎం జగన్ ఇరుక్కున్నారా?

CM Jagan with Employees: ఉద్యోగులతో పెట్టుకొని సీఎం జగన్ ఇరుక్కున్నారా?

CM Jagan with Employees: అలవికానీ హామీలతో ఏపీ ప్రభుత్వం ఏరికోరి కష్టాలు తెచ్చుకుంది. అందులో ముఖ్యంగా తమ నిక్కచ్చి ఓటు బ్యాంకుగా భావిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచే ఆ పార్టీకి ప్రతిఘటన ఎదురవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే విపక్షాల కంటే ఆ రెండు వర్గాలు ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు. నాడు చంద్రబాబుపై ఆ రెండు వర్గాలుకున్న కోపంతో వైసీపీ రాజకీయంగా లబ్ధిపొందింది. వారి సమస్యలను తెరపైకి తెస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. వైసీపీ అధికారంలోకి వస్తే ఆ రెండు వర్గాలకు తిరుగులేదని భ్రమ కల్పించింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. వారం దాటింది..నెలలు దాటాయి..ఏళ్లు దాటాయి.,, సుమారు 150 వారాలు సమీస్తున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన అంటూ వెలువడలేదు. పైగా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులకు ప్రభుత్వం కొర్రీలు పెట్టిందని ఆ రెండు వర్గాల్లో తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ వారు రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే ఒకసారి భారీ స్థాయిలో ఉద్యమించి తమ ప్రతాపాన్ని చుట్టుముట్టారు. ఇప్పుడు ఏకంగా సెప్టెంబరు 1న సీఎం ఇల్లు ముట్టడికి పిలుపునివ్వడంతో ప్రభుత్వంలో టెన్షన్ నెలకొంది. ఎలాగైనా ఉద్యమాన్ని చల్లార్చాలని ప్రభుత్వం చూస్తోంది.

CM Jagan with Employees
CM Jagan with Employees

గుదిబండగా సీపీఎస్..
వైసీపీ సర్కారుకు సీపీఎస్ ఒక గుదిబండగా మారింది. నాడు వెనుకా ముందూ చూసుకోకుండా సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మడత పేచీ వేస్తున్నారు. అవగాహన లేక నాడు సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చానని.. ఓపీఎస్ కానీ అమలుచేస్తే రాష్ట్ర బడ్డెట్ కూడా చాలదని చేతులెత్తేశారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశం రోజురోజుకూ జఠిలంగా మారుతోంది. ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సవాల్ విసురుతున్నారు. కానీ ఎలాగోలా ఆ రెండు వర్గాలను ఒప్పించి జీపీఎస్ అమలు దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలను చెప్పుచేతల్లో పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అందుకే నేరుగా ఉపాధ్యాయ సంఘాలతోనే చర్చలకు పూనుకుంది. ఎలాగైనా జీపీఎస్ కు ఒప్పుకునే ప్రయత్నంలో పడింది.

Also Read: Kalvakuntla Kavitha: బీజేపీ ఆరోపణలపై ‘కవిత’ అస్త్రం.. రేపు మీడియా ముందుకు.. ఏదో జరుగబోతోంది?

చర్చల్లో ప్రతిష్టంభన..
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స నివాసంలో ఆయనతో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఓపీఎస్ అమలు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. మంత్రులు పాత పాటే పాడడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓపీఎస్ అమలు సాధ్యం కాదని తెలిసి కూడా ఎన్నికలకు ముందు ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. తమకు ఆరు నెలలుగా కంట్రీబ్యూషన్ చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ వైసీపీ ప్రభుత్వం చేతిలో మోసపోయామన్న భావనలో ఉన్నారని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఎదురైంది. అటు ఉద్యోగ, ఉపాధ్యాయులు సెప్టెంబరు 1న సీఎం ఇంటి ముట్టడికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

CM Jagan with Employees
CM Jagan

సీఎం ఇంటి ముట్టడికి సన్నాహాలు
చర్చల అనంతరం మంత్రులు విభిన్నంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం 95 శాతం హామీలను అమలుచేసిన విషయం సంఘాల నేతల వద్ద చెప్పామని..వారు సానుకూలంగా స్పందించారని మంత్రులు చెప్పుకొస్తున్నారు. ఓపీఎస్ విషయంలో వారు కొంతవరకూ వెనక్కి తగ్గారని మంత్రులు స్పష్టం చేశారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని చెబుతున్నారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తాము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతామంటే ప్రభుత్వం ఉక్కుపాదంతో అడ్డకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని..తాము జీపీఎస్ నకు ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చిచెబుతున్నారు. మొత్తానికైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ వైసీపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Also Read:TV9 Falling: టీవీ9 ఇంతలా పడిపోవడానికి కారకులు ఎవరు? అసలు ఏం జరిగింది?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version