Elon Musk- PM Modi: మోదీ కి కొత్త వీరాభిమాని…. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కూడా !.

ప్రధాని మోదీకి తాజాగా ఓ వ్యక్తి కొత్తగా అభిమాని అయ్యారు. ఆయన సామాన్య వ్యక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా కంపెనీ, ట్విట్టర్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌.

Written By: Raj Shekar, Updated On : June 21, 2023 9:30 am

Elon Musk- PM Modi

Follow us on

Elon Musk- PM Modi: ప్రధాని నరేంద్రమోదీ.. విశ్వవేదికలపై ఆయనకు ఉన్న క్రేజే వేరు. ప్రపంచలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి భారతీయులతో మోదీ భేటీ అవుతారు. మరోవైపు మోదీని చూసేందుకు కూడా ఎన్‌ఆర్‌ఐలతోపాటు విదేశీయులు కూడా భారీగా హాజరు కావడం మనం చూస్తున్నాం. మోదీ ప్రసంగం వినేందుకు లక్షల మంది ఎదురు చూస్తుంటారు. ఆకట్టుకునే ప్రసంగం… భారతీయత గొప్పదన్నా సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే వాక్‌చాతుర్యత మోదీ సొంతం. ఇదే సమయంలో భారత దేశంలో పెట్టుబడులను ఆకర్షించ గలుగుతారు. శత్రువునైనా తన మాటలతో ఇట్టే ఆకట్టుకోగల నేర్పరి మోదీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నేత మోదీ. గతంలో ఏ భారత దేశ ప్రధానికి లేనంత క్రేజ్‌ మోదీకి విదేశాల్లో ఉంది. ఎంతోమంది దేశాధినేతలే మోదీకి వంగి వంగి నమస్కరిస్తున్నారు. పసిఫిక్‌ ద్వీప దేశమైన పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్‌ మరాపే ఏకంగా మోదీకి పాదాభివందనం చేశారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యా అధినేతలు జో బైడెన్, పుతిన్, బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌ తదితరులు కూడా మోదీ అభిమానులే.

తాజాగా కొత్త అభిమాని..
ప్రధాని మోదీకి తాజాగా ఓ వ్యక్తి కొత్తగా అభిమాని అయ్యారు. ఆయన సామాన్య వ్యక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా కంపెనీ, ట్విట్టర్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌. ఇటీవలే మస్క్‌ ప్రధాని మోదీ ట్విటర్‌ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా అమెరికా పర్యటనకు వెళ్తున్న మోదీని ఆయన కలిసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అమెరికా పర్యటన ఇలా..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు బైడెన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. టెస్లా సీఈవో, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌తో సమావేశం కానున్నారు. చివరిసారి వీరు 2015లో భేటీ అయ్యారు. అప్పట్లో కాలిఫోర్నియాలోని టెస్లా మోటార్స్‌ ఫ్యాక్టరీని మోదీ సందర్శించారు.

భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు యత్నం..
టెస్లా తన భారత్‌లో కూడా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ తరుణంలో మోదీ, మస్క్‌ మధ్య సమావేశం జరగనుంది. దీంతో వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. భారత మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్‌ తెలిపారు. ఈ ఏడాది చివరి కల్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అందుకోసం స్థలాన్ని వెతికే పనిలో ఉన్నామని చెప్పారు.

ప్రముఖులతో భేటీ..
అమెరికా పర్యటనలో అధ్యక్షుడు బైడెన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ మోదీ భేటీ కానున్నారు. వీరిలో మస్క్‌ సహా పారిశ్రామికవేత్తలు, నోబెల్‌ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యారంగ నిపుణులు ఉన్నారు. అమెరికాలో జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేయడం.. ఆయా రంగాల్లో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.