https://oktelugu.com/

Elon Musk: ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్.. ఇకనైనా ‘వాక్ స్వాతంత్య్రం’ వచ్చేనా?

Elon Musk: అది అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం.. ఒక ప్రెసిడెంట్ గా.. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. అమెరికన్లు అత్యధికంగా వాడే ట్విట్టర్ లో తన భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలను.. ప్రతిపక్షాలను ఎండగడుతున్నాడు. అయితే అది కాస్త శృతిమించింది. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ట్విట్టర్, ఫేస్ బుక్ లు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశాయి. ఇక భారత్ లోనూ మోడీ ప్రభుత్వంతో ఈ ట్విట్టర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 26, 2022 / 09:24 AM IST
    Follow us on

    Elon Musk: అది అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం.. ఒక ప్రెసిడెంట్ గా.. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. అమెరికన్లు అత్యధికంగా వాడే ట్విట్టర్ లో తన భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలను.. ప్రతిపక్షాలను ఎండగడుతున్నాడు. అయితే అది కాస్త శృతిమించింది. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ట్విట్టర్, ఫేస్ బుక్ లు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశాయి.

    Elon Musk

    ఇక భారత్ లోనూ మోడీ ప్రభుత్వంతో ఈ ట్విట్టర్ పెట్టుకుంది. ట్విట్టర్ లోని విద్వేష పోస్టులను తొలగించేందుకు స్థానికంగా అధికారులను, బాధ్యులను పెట్టుకోవాలని కేంద్రం కోరినా పెడచెవిన పెట్టింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య, అప్పటి ఐటీ మినిస్టర్ ఖాతాలకు ‘రైట్’ టిక్ తీసేసి ఇష్టానుసారంగా వ్యవహరించింది. వారిని అవమానించింది. ప్రతిపక్ష రాహుల్ గాంధీ గొంతునొక్కేసేలా ఆయన ఖాతాను ఫ్రీజ్ చేసేసింది.

    Also Read: Revanth Reddy: కేసీఆర్ ను నమ్మనోడే బాగుపడ్డాడు.. రేవంత్ హాట్ కామెంట్స్

    ఇలా ట్విట్టర్ ఆగడాలకు అంతే లేదు. ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ గా అందరి వాయిస్ వినిపించాల్సిన ట్విట్టర్ కొందరికే లబ్ధి చేకూర్చిందని.. కొందరి గొంతు నొక్కిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ సీఈవోగా వ్యవస్తాపకుడైన జాక్ పాట్రిక్ డోర్సే వైదొలిగాడు. భారతీయ ఐటీ నిపుణుడైన పరాగ్ అగర్వాల్ ను చైర్మన్ ను చేశారు.

    అయితే ట్విట్టర్ పోకడలు.. వ్యాపార వ్యవహారాలు దిగజారాయన్న ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే 9శాతం వాటాను మొదట ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ కొనుగోలు చేశారు. అనంతరం మొత్తం కొంటానని భారీ ఆఫర్ ఇచ్చాడు. ట్విట్టర్ వాక్ స్వాతంత్య్రానికి దూరంగా ఉందని.. అందులో స్వేచ్ఛ కావాలంటే తన యాజమాన్యంలోకి రావాలని భారీగా డబ్బులు పోసి కొనేందుకు ముందుకు వచ్చాడు. లేదంటే షేర్లు కొని టేకోవర్ చేస్తానని షాకిచ్చాడు.

    ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడైన ఎలన్ మస్క్ ముందు నుంచి స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు పెద్ద పీట వేస్తాడు. ఉక్రెయిన్ లో ఇంటర్ నెట్ సేవలను రష్యన్లు కట్ చేస్తే శాటిలైట్ ద్వారా ఉచితంగా ఇంటర్ నెట్ అందించిన ఘనత ఎలన్ మస్క్ సొంతం. అంతేకాదు.. యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించారు కూడా.

    Elon Musk

    ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ లో 9.2 శాతం షేర్లను కలిగి ఉన్నాడు. శుక్రవారం మస్క్ కంపెనీకి చెందిన పలువురు షేర్ హోల్డర్లతో ప్రైవేట్ మీటింగ్ నిర్వహించిన తర్వాత ట్విట్టర్ వైఖరి మారినట్లు సమాచారం. ఎలన్ మస్క్ కు ట్విట్టర్ ను ఇవ్వడానికి ఒప్పుకుంది. అంతకుముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మస్క్ తరుపున కంపెనీని టేకోవర్ చేయకుండా నిరోధించడానికి ట్విట్టర్ బోర్డు ‘పాయిజన్ పిల్ స్ట్రాటజీ’ని అనుసరించింది. ఈ డీల్ పై చర్చలు జరపడానికి బోర్డు సభ్యులు సిద్ధంగా ఉన్నప్పటికీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కానీ ట్విట్టర్ మస్క్ ఆఫర్ కు అంగీకరించింది. దాదాపు 44 బిలియన్ డాలర్ల(రూ.33,64,28,40,00,000 కోట్లు) ను ట్విట్టర్ కొనుగోలుకు ఎలన్ మస్క్ వెచ్చించాడు. ట్విట్టర్ ప్రతీ షేర్ కు రూ.54.20 డాలర్లు చెల్లించాడు.

    ఒప్పందం పూర్తయిన తర్వాత ట్విట్టర్ ప్రైవేట్ కంపెనీగా మారుతుంది. ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ఇక ట్విట్టర్ తన సరికొత్త ప్రయాణాన్ని సాగించనుంది. ఇప్పుడు ఎలన్ మస్క్ ను ట్విట్టర్ యజమాని అని పిలవవచ్చు అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఇక ట్విట్టర్ లో ‘ఫ్రీ స్పీచ్.. స్వేచ్ఛ ఉంటుందని’ తొలి పోస్ట్ చేశాడు.
    మొత్తానికి ప్రపంచ నంబర్ 1 కుబేరుడు చేతిలోకి అతిపెద్ద సోషల్ మీడియా చేరింది. మరి ఇది ప్రపంచ అసహాయుల, అన్నార్థుల వాయిస్ ను అంతే సమర్థవంతంగా వినిపిస్తుందా? బాధితుల గొంతును పలికిస్తుందా? స్వేచ్ఛగా పనిచేస్తుందా? అన్నది మున్ముందు తేలనుంది.

    Also Read:Goutam Adani: ప్రపంచ కుబేరుల్లో 5వ స్థానానికి.. వారెన్ బఫెట్ ను దాటేసిన గౌతం అదానీ
    Recommended Videos


    Tags