Assembly Elections 2022: పంజాబ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బహుముఖ పోరు ఉంటుందని భావించినా చతుర్ముఖ పోరు సాగుతుందని తెలుస్తోంది. ఓటర్లలో కూడా మార్పు వచ్చినట్లు సమాచారం. అన్ని సర్వేలు ఆప్ కే విజయావకాశాలున్నాయని చెబుతున్నా ప్రస్తుతం మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. ఓటర్ల మనోగతంలో ఇంత మార్పు రావడానికి కారణాలేమై ఉంటాయనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నా కొద్ది కాలంగా నేతల తీరుతో ఓటర్లు ఆ పార్టీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. సీఎం లను మారుస్తూ కాంగ్రెస్ తన పతనం తానే తెచ్చుకుంది. లేకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఓటమి రావడం వారి చేష్టలతోనే అని తెలుస్తోంది. అధిష్టానం కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే ఈ తిప్పలు వచ్చినట్లు అందరికి తెలిసిందే.
Also Read: హిట్ మ్యాన్ రోహిత్ నక్క తోక తొక్కాడా? ఏంటీ వైట్ వాష్ సిరీస్ గెలుపులు?
ఎన్నికలు ముగియడంతో ఓటర్ల మనోగతం చూస్తే రాష్ట్రంలో హంగ్ ఏర్పాటు తప్పదనే వాదనలు వస్తున్నాయి. అతి పెద్ద పార్టీగా ఆప్ అవతరించినా అధికారం కోసం కావాల్సిన సీట్లు మాత్రం రావని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానమే దిక్కని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇంతలా దిగజారి పోవడానికి ప్రధాన కారణం నేతలే అని తెలిసిందే. దీంతో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ కు కష్టాలు తప్పవనే తెలుస్తోంది.
దీంతో ఓటర్లలో వచ్చిన మార్పుకు అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు అధికార పీఠం మాదే అని కలలు గన్న ఆప్ కు చుక్కెదురు కావడంతో ఖంగుతిననుందని తెలుస్తోంది. ఏమైనా ఓటర్లు మాత్రం దిమ్మతిరిగిపోయే ఫలితాలు ఇవ్వనున్నట్లు సమాచారం. పంజాబ్ లో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీల్లో ఆశలు పెరుగుతున్నాయి. కానీ కీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో భాగంగా పంజాబ్ లో కూడా బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కనీసం పది సీట్లు కూడా దక్కించుకోదనే అభిప్రాయం వస్తోంది. దీంతో బీజేపీకి కష్టాలే ఎదురు కానున్నాయి. ఉత్తరాదిలో పట్టు కోల్పేతే అంతే సంగతి అని తెలిసినా పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకోవం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీని గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలు సూచిస్తున్నారు.