BRS TO TRS: బీఆర్ఎస్ తేడా వస్తే టీఆర్ఎస్ కొంపకొల్లేరే.. కేసీఆర్ లో ఆ భయం?

BRS TO TRS: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణకు పరిమితమైన తన పార్టీని దేశవ్యాప్తం చేయడానికి తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి ఈ పార్టీ మారితే టీఆర్ఎస్ గుర్తు ‘కారు’నే బీఆర్ఎస్ కు వర్తిస్తుందా? ఎన్నికల సంఘం దీనికి ఓకే అంటుందా? పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై టీఆర్ఎస్ లో కాస్త ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ అన్నా.. ‘కారు’ గుర్తు అన్నా అందరికీ గుర్తు. కళ్లు మూసుకొని […]

Written By: NARESH, Updated On : June 16, 2022 8:42 pm
Follow us on

BRS TO TRS: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణకు పరిమితమైన తన పార్టీని దేశవ్యాప్తం చేయడానికి తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి ఈ పార్టీ మారితే టీఆర్ఎస్ గుర్తు ‘కారు’నే బీఆర్ఎస్ కు వర్తిస్తుందా? ఎన్నికల సంఘం దీనికి ఓకే అంటుందా? పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై టీఆర్ఎస్ లో కాస్త ఆందోళనలు ఉన్నాయి.

ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ అన్నా.. ‘కారు’ గుర్తు అన్నా అందరికీ గుర్తు. కళ్లు మూసుకొని అయినా కొందరు అభిమానులు, రైతులు, పింఛన్ దారులు ‘కారు’ గుర్తుకు ఓటేస్తారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారితే.. ఒకవేళ గుర్తు మారితే తెలంగాణలోనూ టీఆర్ఎస్ కు బొక్కపడడం ఖాయం. జాతీయ రాజకీయాల మాటేమోకానీ.. రాష్ట్ర రాజకీయాల్లోనే టీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది.

అందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా ఆలోచిస్తోందని సమాచారం. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు ‘కారు’ ఇప్పటికే తెలంగాణలో ప్రతి ప్రజల గుండెల్లో ఉంది. గుర్తు మీద ఓటేసే ప్రజలు గెలిపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు మార్చేస్తే ఎన్నికల గుర్తు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ‘కారు’ను కేటాయించికపోతే ఏంటీ పరిస్థితి అన్నది టీఆర్ఎస్ లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ గుర్తు కేటాయించకపోతే టీఆర్ఎస్ నష్టపోవాల్సి వస్తుంది. గుర్తు విషయంలో పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం లేదా బీఆర్ఎస్ ను స్థాపించి అందులో టీఆర్ఎస్ ను విలీనం చేయడం వంటివి ఆలోచిస్తున్నారు.

జాతీయ పార్టీ పెడితే వచ్చే ఇబ్బందులు..టీఆర్ఎస్ పేరు మార్చితే అవుతుందా? గుర్తు విషయంలో సాధ్యమవుతుందా? అన్న విషయాలను న్యాయనిపుణులతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. వీటి విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతనే జాతీయ పార్టీ విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. లేని పక్షంలో మరిన్ని ప్రత్యామ్మాయాలను పరిశీలించే అవకాశం లేకపోలేదని చర్చ సాగుతోంది.

జాతీయ పార్టీ విషయంలో సీరియస్ గా ఉన్న కేసీఆర్.. ఈ విషయంలో కాస్త ఆలస్యమైనా కూడా గుర్తు, పార్టీ మార్పు విషయంలో క్లారిటీ వచ్చాకనే ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.