తెలుగు టాప్ పత్రిక ఇంత దిగజారిందా?

తెలుగులోనే నంబర్ 1 పత్రిక ఇంత దిగజారిందా? మొన్నటికి మొన్న దాని ఓనర్ ఏకంగా తెలుగు రాష్ట్రాలకు చెరో 10 కోట్ల చొప్పున 20 కోట్ల విరాళం ఇచ్చాడు. అలాంటి ఆయన పత్రిక ఉద్యోగులపై లీవులపై పంపిందని విన్నాం. ఇప్పుడు ఉన్న వారికి చరిత్రలోనే తొలిసారి జీతాలు ఆలస్యం చేస్తోంది. ఇది ఆ నంబర్ 1 పత్రికలో ఇదే ప్రప్రథమమట.. ఠంచనుగా 1వ తారీఖునే పడే జీతాలను ఈసారి 10వ తారీఖున వేస్తామని యాజమాన్యం తెలిపిందట.. మరీ […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 6:48 pm
Follow us on


తెలుగులోనే నంబర్ 1 పత్రిక ఇంత దిగజారిందా? మొన్నటికి మొన్న దాని ఓనర్ ఏకంగా తెలుగు రాష్ట్రాలకు చెరో 10 కోట్ల చొప్పున 20 కోట్ల విరాళం ఇచ్చాడు. అలాంటి ఆయన పత్రిక ఉద్యోగులపై లీవులపై పంపిందని విన్నాం. ఇప్పుడు ఉన్న వారికి చరిత్రలోనే తొలిసారి జీతాలు ఆలస్యం చేస్తోంది. ఇది ఆ నంబర్ 1 పత్రికలో ఇదే ప్రప్రథమమట.. ఠంచనుగా 1వ తారీఖునే పడే జీతాలను ఈసారి 10వ తారీఖున వేస్తామని యాజమాన్యం తెలిపిందట.. మరీ మొత్తం వేస్తారా? ఏమైనా 20, 30 శాతం కోతలు వేస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఆ పత్రిక జీతాలు లేటు వేస్తామని ప్రకటన ఇచ్చిందట..

*నాడు వైఎస్ దెబ్బను తట్టుకుంది..
నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఆయనను ఎదురించిన ఆ పత్రిక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. దాని ఆర్థిక మూలాలు దెబ్బతీసిన వైఎస్ఆర్ నాడు పత్రిక మనుగడనే కష్టం చేశారు. దీంతో ఏ దిక్కు లేకపోయేసరికి దేశంలోనే నంబర్ 1 కుబేరుడిని ఆశ్రయించి ఆయన కంపెనీ ద్వారా పత్రికలో షేర్లు కొనిపించి గట్టెక్కింది. ఇక అప్పుడు కూడా 1వ తారీఖునే జీతాలిచ్చింది ఆ పత్రిక.

*కరోనా దెబ్బకు కుదేలైందట..?
అయితే కరోనా ఇప్పుడు పత్రికను తీవ్రంగా దెబ్బతీసిందట.. దెబ్బతీసిందా? వీరే గల్లాపెట్టె నుంచి డబ్బులు బయటకు తీయడం లేదో తెలియదు.. కానీ జీతాలను 10వ తారీఖున వేస్తామని తెలిపారట.. నిజానికి తెలుగులోనే నంబర్1 పత్రికకు ఆర్థిక కష్టాలు అంటే ఎవరూ నమ్మని పరిస్థితి. జీతాలు ఇచ్చే డబ్బులు కూడా లేవు అని వాయిదా వేయడాన్ని ఎవరూ నమ్మడం లేదు. కానీ తమ గల్లాపెట్టె తీయకుండా ఈ కరోనా టైంలో పత్రిక ద్వారా వచ్చిన ఆదాయంతోనే డబ్బులివ్వాలని వచ్చినదాన్ని బట్టి జీతాల్లో కోతలు వేయాలనే ఆ ప్రధాన పత్రిక ఆలోచనగా చెబుతున్నారు.

*వీళ్ల పోస్టులు ఊస్ట్
ఇక ఇదే పత్రిక ఆఫ్టర్ కరోనా తమ డెస్కుల్లో పనిచేసే డిజైనర్లను ఇక రావద్దని చెప్పిందట.. వేరే చూసుకోండని సూచించిందట.. ఇక నుంచి వీరి డిజైనర్ల పనిని కూడా సబ్ ఎడిటర్ల చేతే చేయించాలని యోచిస్తోందట.. ఇలా దిగ్గజ పత్రికలోనూ పేజినేషన్ చేసే డిజైనర్లు రోడ్డున పడడం ఖాయంగా కనిపిస్తోంది.

*ముందుంది జర్నలిస్టులకు గడ్డుకాలమే
ఇక ఆ ప్రధాన పత్రిక దగ్గినా తుమ్మినా ఫాలో అయిపోయే మిగతా పత్రికలు కూడా అదే బాటలో పయనిస్తాయి. కాబట్టి మిగతా సంస్థల్లోనూ ఈ సంస్కరణలు అమలవుతాయి. ప్రస్తుతానికి ఇలాంటి సంస్కరణలకు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న అధికారపార్టీ పత్రికలు దూరంగా ఉన్నాయి. కానీ కరోనా టైం ఇలాగే కొనసాగితే వాటిలోనూ ఈ తీసివేతలు.. కోతలు తప్పకపోవచ్చు. అందుకే అందరూ కాలు కాలిన పిల్లుల్లా సైలెంట్ గా ఉంటున్నారు. చూడాలి మరీ కరోనాతో దెబ్బతిన్న పత్రిక పడవలో జర్నలిస్టుల జీవితాలు ఏ తీరాలకు చేరుతాయో..?