Jagan: జగన్ పై కడుపు మంట తెచ్చిన తంటా

జగన్ పారిశ్రామిక విధానంపై పిచ్చి రాతలతో రెచ్చిపోతున్నాయి. అదా నీ సంస్థకు జగన్ దోచుకు పెడుతున్నట్లు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రజ్యోతిలో అదాని బీచ్ శాండ్ ఒప్పందాలపై వస్తున్న కథనాలు ఎల్లో మీడియా ఆలోచనను తెలియజేస్తున్నాయి.

Written By: Dharma, Updated On : November 21, 2023 3:04 pm

CM Jagan

Follow us on

Jagan: ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల రాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారికి జాతీయ ప్రయోజనాలు కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యం. ప్రజా సమస్యల కంటే.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అవసరాలే ముఖ్యం. అందుకు ఎంత దాకైనా తెగిస్తారు. ఎవరితోనైనా పోరాటం చేస్తారు. తాము చేస్తే లోక కళ్యాణం.. ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్న కోణంలో వారి తీరు ఉంటుంది. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పై విషపు రాతలు రాస్తే.. నేడు ఆయన కుమారుడు జగన్ పై రాతలతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొద్దిరోజుల పాటు రామోజీరావు బ్యాలెన్స్ గా వెళ్లారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. జగన్ చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై.. వాటిని ఖ్యాతిని తగ్గించేలా.. ఇవి పాతవే, ఇప్పటికే ఉన్నవే, పేర్లు మార్చి అమలు చేస్తున్నారంటూ.. లేనిపోని ప్రచారాలు చేశాయి.అవన్నీ చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టినవేనని తప్పుడు కథనాలు ప్రచురించాయి.

ఇప్పుడు జగన్ పారిశ్రామిక విధానంపై పిచ్చి రాతలతో రెచ్చిపోతున్నాయి. అదా నీ సంస్థకు జగన్ దోచుకు పెడుతున్నట్లు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రజ్యోతిలో అదాని బీచ్ శాండ్ ఒప్పందాలపై వస్తున్న కథనాలు ఎల్లో మీడియా ఆలోచనను తెలియజేస్తున్నాయి. అదో దేశ విద్రోహ చర్యగా చూపించే ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బీచ్ అండ్ ఉత్పత్తులను అదాని మన దేశానికి అమ్ముతారు కదా? కానీ దాంతో దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న రీతిలో ఆర్కే కథనాలు ఉన్నాయి. గతంలో ఇదే ఆదాని టిడిపి ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెడితే.. పారిశ్రామిక విధానానికి ఏపీ స్వర్గధామం అని.. దేశంలోనే ఉన్నత పారిశ్రామిక దిగ్గజం అదాని అని ఇదే ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

ప్రస్తుతం వైసిపి అధికారంలో ఉంది. ఈ నాలుగు సంవత్సరాలు ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని.. కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదని చెప్పేందుకు ఆంధ్రజ్యోతి గత కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది. అయితే ఇటీవల పారిశ్రామిక ఒప్పందాల్లో భాగంగా… అదాని కంపెనీ ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది జగన్ వ్యతిరేకించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మింగుడు పడని విషయం. స్వతహాగా జగన్ పారిశ్రామికవేత్త. పైగా పారిశ్రామికవేత్తలకు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉంటాయి. గతంలో అదాని చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు. పారిశ్రామికవేత్తలు రాజకీయాలకు అనుగుణంగా వ్యవహరించక తప్పదు. కానీ జగన్ పై కోపంతో పారిశ్రామికవేత్తలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమే తప్ప.. పనికొచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.