EC new rule: ఎన్నికల కమిషన్ కల్పించనుంది. వందేళ్లు దాటిన ఓటర్లు రాష్ట్రంలో దాదాపు 17 వేల మంది ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. 80ఏళ్లు దాటిన ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చేలా ఈసీ ప్రోత్సహిస్తున్నప్పటికీ, రాలేనివారి కోసం వీఎఫ్ హెచ్ సదుపాయం కల్పిస్తున్నామని ముఖ్య ఎన్నికల కమిషనర్ చెబుతున్నారు. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరు వచ్చారు.
ఇదే తొలిసారి
80 ఏళ్లు దాటినవారికి ఈ సదుపాయం కల్పించడం ఇదే తొలిసారి. అధికారుల బృందాలు ఫారం-12డీతో అలాంటివారి ఇళ్లకు వెళ్లి ఓటు వేసే సదుపాయం కల్పిస్తాయి. వీరు ఎవరికి ఓటు వేస్తున్నారనే గోప్యత పాటిస్తామని, ఈ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీయిస్తామని ఎన్నికల కమిషనర్ చెబుతున్నారు. వికలాంగుల కోసం ‘సాక్షం’ అనే మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టారు., వారు దానిలోకి లాగిన్ అయ్యి, ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ‘సువిధ’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించారు. ఎన్నికల ర్యాలీలు, సమావేశాలకు అనుమతికి కూడా అభ్యర్థులు సువిధ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు.. ఓటర్ల కోసం ‘మీ అభ్యర్థి ఎవరో తెలుసుకోండి(కేవైసీ)’ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ ప్రారంభించింది.. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టారో రాజకీయ పార్టీలు తమ పోర్టల్స్, సోషల్ మీడి యా వేదికల ద్వారా ఓటర్లకు తెలియజేయాలని ఎన్నికల కమిషన్ అంటోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు ‘ఈ-విజిల్’ మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రం మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉండగా, అందులో ఎస్సీలకు 36, ఎస్టీలకు 15 రిజర్వు చేశారు.. మొత్తం ఓటర్లు 5.21 కోట్లు, అందులో మహిళా ఓటర్లు 2.59 కోట్ల మంది. తొలిసారిగా ఓటు హక్కు నమోదైనవారు 9.17లక్షల మంది, శతాధిక వృద్ధులు 16,976, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 4,699 మంది ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 12.15 లక్షలు, వికలాంగ ఓటర్లు 5.55 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేష న్లు 58,272. వీటిలో 24,063 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కోపోలింగ్ స్టేషన్‌కు సగటున 883 మంది ఓటర్లు ఉంటారు. 1,320 పోలింగ్ కేంద్రాలను మహిళలు, 224 కేంద్రాలను యువత, మరో 224 కేంద్రాలను వికలాంగులు నిర్వహించనున్నట్టు సీఈసీ చెబుతున్నారు. 1,200 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు , 29,141 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించనున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 24న ముగియనున్నందున ఆ లోపే ఎన్నికలు జరపాల్సి ఉందని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడుతోంది. పక్షపాతంతో వ్యవహరించే ఎన్నికల అధికారులపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికలను డబ్బు ప్రభావితం చేయకుండా బ్యాంకులు తమ వ్యవస్థలో పరిశీలన జరపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
