Easy loans for Women : వీటిని షార్ట్ టర్మ్ లోన్స్ అని కూడా అంటారు. ఈ లోన్స్ పొందడానికి ఇల్లు లేదా నగలను తాకట్టు పెట్టాల్సిన పని ఉండదు. చాలామంది మహిళలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. ఒకపక్క ఇంటిని మేనేజ్ చేయడంతో పాటు పిల్లలను చూసుకోవడం అలాగే కుటుంబాన్ని పోషించడం వంటి అనేక బాధ్యతలతో ముఖ్యంగా మహిళలు సతమతమవుతారు. ఈ క్రమంలో పిల్లల స్కూల్ ఫీజులు అలాగే వైద్య ఖర్చులు వంటి అనుకొని ఖర్చులు కుటుంబంపై ఆర్థిక భారం పెంచుతాయి. ఇటువంటి వారికి తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ చాలా సహాయపడతాయి. ఇవి షార్ట్ టర్మ్ లోన్స్. ఈ లోన్స్ పొందడానికి ఎటువంటి పూచికత్తు పెట్టాల్సిన పనిలేదు. ఇల్లు లేదా నగలు వంటివి కూడా తాకట్టు పెట్టనవసరం లేదు. ఈ లోన్ పొందడానికి ఎక్కువ పేపర్ వరకు కూడా ఉండదు. అలాగే లోన్ పొందడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.
ఆన్లైన్లో కూడా మీరు ఈ లోన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. చాలా వేగంగా ఈ లోన్ అప్రూవల్ జరుగుతుంది. ఇంటి దగ్గర నుంచే ముఖ్యంగా గృహినీలు చాలా సులభంగా ఇన్స్టంట్ పర్సనల్ లోన్ పొందవచ్చు. కొన్ని గంటలలోనే వారి బ్యాంకు ఖాతాలలో డబ్బులు పడతాయి. ఇన్సిడెంట్ లోన్ లో మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తాయి. వీళ్ళు చాలా సులభంగా రీపేమెంట్ చేసుకోవచ్చు. వీటి ప్రాసెసింగ్ ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీటికి సంబంధించి మీకు ముందుగానే వివరాలు అందిస్తారు. అలాగే ఈ లోన్లను పొందడానికి మీ దగ్గర ఉన్న విలువైన ఆస్తులను కూడా తాకట్టు పెట్టాల్సిన పని ఉండదు. ఈ లోన్ కి అప్రూవల్ కూడా చాలా వేగంగా దొరుకుతుంది.
Also Read : ‘అంతిమ లబ్ధిదారుడు’ టార్గెట్.. సిట్ కస్టడీ ఆ నలుగురు
అలాగే కేవలం కొన్ని గంటలలోనే లోన్ అప్రూవ్ అయ్యి డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడతాయి. మీరు అత్యవసర సమయాలలో డబ్బుల కోసం అధిక వడ్డీలకు థర్డ్ పార్టీలపై ఆధార పడాల్సిన పని ఉండదు. ఇన్స్టెంట్ లోను పొందడానికి మీకు ఆధార్ కార్డు తో పాటు పాన్ కార్డు, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చిరునామా ప్రూఫ్ కింద మీరు పాస్పోర్టు, యుటిలిటి బిల్లు వంటివి పెట్టవచ్చు. ఇవన్నీ రెడీగా పెట్టుకొని మీరు దరఖాస్తు చేసుకుంటే మీరు కేవలం కొన్ని గంటలలో లోను పొందొచ్చు.