https://oktelugu.com/

మళ్లీ భూప్రకంపనలు: బోరబండలో ఏం జరుగుతోంది..?

అది హైదరాబాద్‌ మహానగరంలోని బోరబండ. ఏం జరుగుతోందో తెలియదు.. ఒక్కసారిగా శబ్దాలు.. ప్రజలంతా హైరానా పడ్డారు. ఇళ్లల్లోంచి బయటకు వచ్చేశారు. అదంతా వట్టిదే అని పలువురు చెప్పగా మళ్లీ ఇంట్లోకి వెళ్లారు. కానీ.. సేమ్‌ సీన్‌ రిపీట్‌. మళ్లీ అవే శబ్దాలు. అలా ఒకరోజు గడిపారు. సెకండ్‌ డే కూడా మళ్లీ శబ్దాలు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడి వాసులు బెంబేలెత్తిపోయారు. హైదరాబాద్‌లోని బోరబండలో మరోసారి భూప్రకంపనలు బీభత్సం రేపాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతూ బయటకు పరుగులు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 / 08:59 AM IST
    Follow us on


    అది హైదరాబాద్‌ మహానగరంలోని బోరబండ. ఏం జరుగుతోందో తెలియదు.. ఒక్కసారిగా శబ్దాలు.. ప్రజలంతా హైరానా పడ్డారు. ఇళ్లల్లోంచి బయటకు వచ్చేశారు. అదంతా వట్టిదే అని పలువురు చెప్పగా మళ్లీ ఇంట్లోకి వెళ్లారు. కానీ.. సేమ్‌ సీన్‌ రిపీట్‌. మళ్లీ అవే శబ్దాలు. అలా ఒకరోజు గడిపారు. సెకండ్‌ డే కూడా మళ్లీ శబ్దాలు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడి వాసులు బెంబేలెత్తిపోయారు.

    హైదరాబాద్‌లోని బోరబండలో మరోసారి భూప్రకంపనలు బీభత్సం రేపాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతూ బయటకు పరుగులు తీశారు. రెండ్రోజుల క్రితం వచ్చిన శబ్దాలు, ప్రకంపనల కన్నా ఇప్పుడు అధికంగా రావడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారీ శబ్దాలు వస్తుండంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా.. భారీ శబ్దాలతో 4 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు.

    అయితే.. అక్కడ వచ్చినవి నిజంగా భూప్రకంపనలేనా.. లేదా ఏదైనా బ్లాస్టింగ్‌ వల్ల జరిగాయా..? దీనిపై భూగర్భ నిపుణులు స్పందించారు. రహమత్‌నగర్‌‌, బోరబండ ప్రాంతాల్లో వచ్చిన భూ ప్రకంపనలు సహజమైనవేనని ఎన్జీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్త శ్రీనగేష్‌ చెప్పారు. ఈ కదలికలు, శబ్దాల వల్ల ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశమే లేదని భరోసా కల్పించారు. భూమి లోపలిపొరల్లోకి నీరు చేరుతున్న వేళ ఇలాంటి శబ్దాలు రావడం సహజమేనని ఆయన చెప్పారు.

    బోరబండలో భూకంపాలపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ఆయన చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం వెల్లటూరులో ఇప్పటి వరకూ 1,600 సార్లు భూమి కంపించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలు భయం వీడి హ్యాపీగా ఉండాలని సూచించారు.