https://oktelugu.com/

బిగ్ బాస్: నాగార్జున ఊరించి ఊసురుమనిపించాడు‌..

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కొద్దికొద్దిగా ప్రేక్షకులను అలరిస్తోంది. హోస్ట్‌గా చేస్తున్న కింగ్‌ నాగార్జుననే షో బాధ్యతలను మొత్తం మీదేసుకొని నడిపిస్తున్నారు. ఐదు రోజుల పాటు కంటెస్టెంట్స్‌ గేమ్స్‌ చూస్తున్న ప్రేక్షకులు.. వీకెండ్‌ శని, ఆదివారాల్లో నాగార్జున షోను ఎక్కువగా చూస్తున్నారు. ఈ శని, ఆదివారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అయితే.. నాలుగోవారం ఎలిమినేషన్‌కు ఏడుగురు కంటెస్టెంట్లు.. దేత్తడి హారిక, కుమార్ సాయి, సొహైల్, మెహబూబ్, లాస్య, అభిజిత్, స్వాతి దీక్షిత్‌ నామినేట్ కాగా.. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 / 09:03 AM IST

    Netizens troll to bigg boss-4

    Follow us on

    బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కొద్దికొద్దిగా ప్రేక్షకులను అలరిస్తోంది. హోస్ట్‌గా చేస్తున్న కింగ్‌ నాగార్జుననే షో బాధ్యతలను మొత్తం మీదేసుకొని నడిపిస్తున్నారు. ఐదు రోజుల పాటు కంటెస్టెంట్స్‌ గేమ్స్‌ చూస్తున్న ప్రేక్షకులు.. వీకెండ్‌ శని, ఆదివారాల్లో నాగార్జున షోను ఎక్కువగా చూస్తున్నారు. ఈ శని, ఆదివారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అయితే.. నాలుగోవారం ఎలిమినేషన్‌కు ఏడుగురు కంటెస్టెంట్లు.. దేత్తడి హారిక, కుమార్ సాయి, సొహైల్, మెహబూబ్, లాస్య, అభిజిత్, స్వాతి దీక్షిత్‌ నామినేట్ కాగా.. వీరిలో స్వాతి ఎలిమినేట్ అయింది.

    స్వాతి ఎలిమినేషన్‌ను శనివారమే ప్రకటించగా.. ఆమెను బిగ్‌బాస్‌ స్టేజీ పైకి ఆదివారం పిలిపించారు. మొదట బిగ్ బాస్‌హౌజ్‌లో స్వాతి జర్నీని చూపించారు. ఆ తరువాత ఎలిమినేట్ అయిన స్వాతికి ఒక టాస్క్ ఇచ్చారు. కార్డులపై కొన్ని లక్షణాలు రాసి.. కార్డుపై ఉన్న లక్షణం హౌజ్‌లో ఏ వ్యక్తికి సెట్ అవుతుందో చెప్పాలన్నారు. స్టోర్ రూంలో నుంచి ఆ లక్షణాలు రాసున్న బోర్డులను జోర్దార్ సుజాతను తీసుకురమ్మన్నారు.

    స్వాతి తీసిన మొదటి కార్డు మీద ‘నక్క తోక తొక్కిన వారు’ అని ఉండగా.. ఈ కార్డ్ కుమార్ సాయికి సరిపోతుందని స్వాతి అన్నారు. దీనికి కారణం కూడా చెప్పారు. కుమార్ సాయి టాలెంటెడ్ కంటెస్టెంట్ అని.. అయితే వెనక నుంచి ఎవరైనా పుష్ చేస్తే తప్ప తన టాలెంట్‌ను బయటపెట్టరని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే నక్క తోక తొక్కి కెప్టెన్ అయిపోయారని నిందేసింది.

    ఆ తర్వాత నమ్మక ద్రోహి బోర్డను అమ్మరాజశేఖర్‌‌కు, పుకార్ల పుట్ట జోర్దార్‌‌ సుజాత, దొంగగా సొహైల్‌, అవకాశవాదిగా లాస్య, గుడ్డిగా నమ్మేవారుగా నోయల్‌,  అనుసరించే వారిగా మెహబూబ్‌, ఏమార్చేవారిగా మోనాల్‌, ఓవర్‌‌ కాన్ఫిడెన్స్‌గా అరియానా, ట్యూబ్‌లైట్‌గా హారిక. అహంకారి బోర్డు అభిజిత్‌కు, చాడీల చిట్టాను గంగవ్వకు, గమ్యం లేని పక్షిని అఖిల్‌కు ఇచ్చింది.

    సన్‌డే అంటే ఫన్‌డే.. అందుకే ఎలిమినేషన్ ప్రక్రియను పక్కన బెట్టి మంచి ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్ సెట్ చేశారు బిగ్‌ బాస్. హౌజ్‌లో ఉన్న అబ్బాయిలంతా అమ్మాయిల్లా రెడీ అయ్యారు. అమ్మాయిలు అబ్బాయిల్లా సిద్ధమయ్యారు. వాళ్లను చూసి నాగార్జున పడి పడి నవ్వారు. ఆయనే కాదు ప్రేక్షకులకు కూడా నవ్వుతారు. అంతలా రెడీ అయ్యారు వారంతా. వాళ్ల పేర్లను కూడా మార్చారు నాగార్జున. వాళ్లందరినీ ఏరియాలోకి పిలిచి వాళ్లతో ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రాం చేశారు. జంటలుగా విడదీసి ఒక్కో ఎంటైర్‌టైన్ టాస్క్ ఇచ్చారు. వీటిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు చేశారో కూడా నాగార్జున చెప్పారు. అరియానా-సోహైల్ జంట సాంగ్స్‌లో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్, అమ్మ రాజశేఖర్-సుజాత జంట సీన్‌లో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ చేశారని నాగార్జున డిసైడ్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లతో కొత్త రకం కబడ్డీ గేమ్‌ను ఆడించారు నాగార్జున.

    అయితే.. స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కావడంతో ఈవారం నామినేషన్స్‌లో మరో ఆరుగురు మిగిలి ఉన్నారు. వారిలో నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నట్టు నిన్న నాగార్జున కాస్త బిల్డప్ ఇచ్చారు. కానీ.. ఆదివారం ఎపిసోడ్‌లో 1 నుంచి 6 నంబర్లు బోర్డులను ఏర్పాటు చేసి ఈ ఆరుగురిని ఒక్కో నంబర్ వద్ద నిలబడమని చెప్పారు. ఏ నెంబర్ వద్ద ఎవరు నిలబడాలో వారినే డిసైడ్ చేసుకోమని సూచించారు. మొత్తం మీద డిస్కషన్స్ పెట్టి ఒక్కొక్కరు ఒక్కో నంబర్ వద్ద ఫిక్స్ అయ్యారు. ఈ కథ అంతా అయ్యాక.. కాస్త టెన్షన్ పెడుతూ చివరికి అందరూ సేఫ్ అని ప్రకటించేశారు.