Earthquake in Bengaluru: బెంగుళూరులో భూకంపం భయపెట్టింది. ప్రజలను బెదరగొట్టింది. భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో బుధవారం స్వల్ప భూకంపం చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ఉదయం 7.09 గంటలకు భూమి కంపించినట్లు తెలుస్తోంది. చిక్కబళ్లాపురలో భూమి నుంచి 11 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1 గా నమోదైనట్లు చెబుతున్నారు.

అయితే భూకంపం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్ర్తవేత్తలు తెలిపారు. ఇది స్వల్ప భూకంపమేనని చెప్పారు. దీనిపై భయాందోళనలు వ్యక్తమైనా ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది. ప్రజలు భూకంపం గురించి చర్చించుకున్నారు. ఏం జరుగుతుందో తెలిసే లోగానే భూమి కదులుతున్నట్లు అనిపించడంతో ఆందోళనకు గురయ్యారు.
భూకంపం గురించి ఎవరు కూడా చింతాల్సిన పని లేదని శాస్ర్తవేత్తలు సూచిస్తున్నా ప్రజల్లో భయం పోవడం లేదు. గతంలో ఎన్నడు లేని విధంగా భూమి కంపించడంతో ఏం అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో మహా నగరంగా రూపుదిద్దుకుంటున్న ప్రాంతం కావడంతో ప్రజలంతా గుమిగూడి చర్చించుకున్నారు.
Also Read: Omicron: ఒమిక్రాన్ వేరియంట్‌లో HIV వైరస్ మూలాలు.. దక్షిణాఫ్రికా సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!
నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ నివేదిక ప్రకారం భూకంపం తీవ్రత అంతగా లేదని చెబుతున్నారు. దీంతో ప్రజలు ఎక్కడ కూడా భయం పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఎప్పుడు రాని భూకంపం ఇప్పుడు రావడంతో భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం జరుగుతుందో ఏమోననే సందేహాలు వస్తున్నాయి.
Also Read: Centre bans 20 YouTube channels: పాకిస్తాన్ కుట్రలను భగ్నం చేసిన భారత్.. 20 యూట్యూబ్ చానళ్లు బ్లాక్