https://oktelugu.com/

కరోనాపై పోరాటం.. హైదరాబాదీల స్వచ్చంధ లాక్ డౌన్

తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. గడిచిన పదిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో 32,224మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 19,205మంది కరోనా నుంచి కోలుకోగా 339మంది మృత్యువాతపడ్డారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు రెండు వేల కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. దీంతోపాటు వైరస్ వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. కేసీఆర్ ఆందోళన అందుకేనా? నగరంలో కేసుల సంఖ్య పెరిపోతుండటంతో హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధిస్తారని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 / 05:41 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. గడిచిన పదిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో 32,224మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 19,205మంది కరోనా నుంచి కోలుకోగా 339మంది మృత్యువాతపడ్డారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు రెండు వేల కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. దీంతోపాటు వైరస్ వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు.

    కేసీఆర్ ఆందోళన అందుకేనా?

    నగరంలో కేసుల సంఖ్య పెరిపోతుండటంతో హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధిస్తారని భారీగా ప్రచారం జరిగింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగులు చేస్తున్న వారంతా సొంతూళ్లకు వెళ్తుండటంతో నగరమంతా నిర్మానుష్యంగా మారుతోంది. కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక చాలామంది ఇంటిదారి పడుతున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే దర్శనిమస్తున్నాయి.

    అయితే నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేక్రమంలో హైదరాబాదీలు కరోనా క్యారియర్లుగా మారుతున్నారని అభిప్రాయం వ్యకమవుతోంది. వీరంతా సొంతూళ్లకు వెళుతూ వారితోపాటు కరోనా వైరస్ మోసుకెళుతుండటంతో అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు గ్రీన్ జోన్లుగా ఉన్న జిల్లాల్లోనూ లాక్డౌన్ సడలింపుల తర్వాత భారీగా నమోదవుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తుంది.

    జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?

    మరోవైపు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్ అడ్డాలు వైరస్ కేంద్రాలు మారిపోతున్నాయి. ఇక్కడి నుంచి కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతుండటంతో వ్యాపారులంతా అప్రమత్తయ్యారు. దీంతో కొన్ని ఏరియాల్లో ఇప్పటికే వ్యాపారులు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లోని వ్యాపారులు చర్చించుకొని కొందరు షాపుల సమయాన్ని తగ్గించుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా నెలరోజులపాటు వ్యాపారులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

    ఒకప్పుడు లాక్డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేసిన వ్యాపారులే నేడు స్వచ్చంధంగా లాక్డౌన్ కు ముందురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొన్ని ఏరియాల్లో స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తే కరోనా వైరస్ చైన్ తెగిపోయే అవకాశంలేదని అభిప్రాయాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడిగా కరోనాపై పోరాటం చేస్తే కరోనా  రాష్ట్రం నుంచి తరిమికొట్టొచ్చని అంటున్నారు.

    ఇప్పటికే చెన్నె, పుణే, బెంగుళూరు లాంటి నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ నగరంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని కోరుతున్నారు. హైదరాబాదీలను కరోనా క్యారియర్లుగా కాకుండా వారియర్స్ మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..!