Diwali: దీపావళి పూట ఆత్మలకు పూజలు, టపాసులు పేల్చారు.. షాకింగ్ కారణం

Diwali: ప్రపంచంలో ఎన్నో ఆచారాలు, ఎన్నో సంప్రదాయాలు. ఒక్కో ఆచారం ఒక్కో తీరుగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలు ఉన్నా అవి వెలుగులోకి రానివి కూడా చాలా ఉన్నాయి. దేశ భౌగోళిక స్వరూపం దృష్ట్యా వేలాది భాషలు, లక్షలాది సంప్రదాయాలు, కోట్లాది ఆచారాలు మనుగడలో ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రజల మధ్య సంబంధాలు కూడా అదే విధంగా కొనసాగడం విచిత్రమే. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ వినూత్న సంప్రదాయం వాడుకలో ఉంది. ప్రతి దీపావళి […]

Written By: Srinivas, Updated On : November 5, 2021 5:50 pm
Follow us on

Diwali: ప్రపంచంలో ఎన్నో ఆచారాలు, ఎన్నో సంప్రదాయాలు. ఒక్కో ఆచారం ఒక్కో తీరుగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలు ఉన్నా అవి వెలుగులోకి రానివి కూడా చాలా ఉన్నాయి. దేశ భౌగోళిక స్వరూపం దృష్ట్యా వేలాది భాషలు, లక్షలాది సంప్రదాయాలు, కోట్లాది ఆచారాలు మనుగడలో ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రజల మధ్య సంబంధాలు కూడా అదే విధంగా కొనసాగడం విచిత్రమే.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ వినూత్న సంప్రదాయం వాడుకలో ఉంది. ప్రతి దీపావళి రోజున కుటుంబ సభ్యులందరు తమకు సంబంధించిన సమాధుల వద్ద శుభ్రం చేసి సున్నం వేస్తారు. అనంతరం అందంగా అలంకరించి అక్కడే దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. తరువాత టపాసులు కూడా కాలుస్తారు. తమ పూర్వీకుల కోసం చేసే పూజలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది.

ప్రతి సంవత్సరం ఇలాగే చేయడం చూస్తుంటే వారిలో ఉన్న భక్తికి అందరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ కొనసాగే ఆచారంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. దీనికి ప్రజాప్రతినిధులు సైతం హాజరై తమ మద్దతు ప్రకటిస్తారు. వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు శాంతి చేకూరాలని పూజలు చేసిన అనంతరం అక్కడే గడుపుతారు.

దీపావళి కోసం ఏర్పాటు చేసిన వంటకాలను తమ పూర్వీకుల కోసం అక్కడే పెట్టి మొక్కుతారు. స్థానికుల తీరుకు పుర ప్రముఖులు కూడా తమ ఆచార వ్యవహారాలను చూసి మురిసిపోతుంటారు. దీనిపై అక్కడే ఉన్న వారిని గురించి తమ బంధువులు ఆరాధించడం వారి భక్తికి నిదర్శనం.

Tags