తెలంగాణలోని దుబ్బాకలో త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో తెలంగాణలో బై ఎలక్షన్ వచ్చింది. ఈ స్థానం టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కావడంతోపాటు కంచుకోట. దీంతో ఈ ఉప ఎన్నికలో గెలిచి సత్తాచాటాలని టీఆర్ఎస్ ఉవ్విళ్లురుతోంది.
Also Read: కేబినెట్ లోకి కవిత.. ఎవరికి ఎసరు?
అయితే దుబ్బాకలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పోటీలో నిలిచింది. ఆమె గెలుపు బాధ్యతను మంత్రి హరీష్ రావు భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కంటే కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నట్లు పలు సర్వేల్లో తేలింది.
దీంతో రఘునందన్ కు వ్యతిరేకంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే రఘునందన్ పై సొంత పార్టీ నేత కమలాకర్ రెడ్డి విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది. రఘునందన్ భూ సెటిల్మెంట్స్ చేస్తాడని.. రేపిస్టు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో బీజేపీ అధిష్టానం కమలాకర్ రావును పార్టీ నుంచి బహిష్కరించింది.
ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీ సస్పెండ్ చేసిన కమలాకర్ రావుతో రహస్య చర్చలు జరుపడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి స్వయంగా కమలాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో రావాలని కోరినట్లు సమాచారం. బీజేపీలో నిబద్ధతతో పనిచేసి వ్యక్తి కమలాకర్ రెడ్డి అంటూ రేవంత్ అతడిని ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. తప్పు చేసిన వారికి టికెట్ ఇచ్చి పార్టీ కోసం పనిచేసే వారిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
అదేవిధంగా టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో రేవంత్ ఫైర్ అయ్యారు. పెళ్లి రోజు నుంచి చావు వరకు రామలింగారెడ్డితో ఉన్నామని చెబుతున్న టీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఎందుకు మంత్రి పదవీ ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి ఉద్యమకారులకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
Also Read: రష్యన్ అమ్మాయి నుంచి రఘురామ వైన్ ఎందుకు తాగాడంటే?
మంత్రి హరీష్ రావు పరిస్థితిలో టీఆర్ఎస్ లో తీసేసిన తహసీల్దార్ మారిందంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ లో కండువా వేసుకున్న రోజే పండుగ అని.. ఆ తర్వాత దండుగేనంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించాడు. దీంతో దుబ్బాక పాలి‘టిక్స్’ రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. దీంతో ఈ ఎన్నికలో గెలుపు ఎవరిది అనే చర్చ జోరుగా సాగుతోంది.