
తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. దుబ్బాక స్థానం టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా ఆ సీటు దక్కించుకునేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో దుబ్బాకలో టీఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెప్పాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతోన్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అధికారంలోని టీఆర్ఎస్.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్.. బీజేపీ నేతలు ఇప్పటికే దుబ్బాకలో తిష్టవేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ పోరులో కాంగ్రెస్ వెనుకబడగా టీఆర్ఎస్.. బీజేపీలు నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నాయి. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తోంది.
Also Read: సోషల్ మీడియాలో సినీ నటితో మంత్రి రాసలీలలు వైరల్
రామలింగారెడ్డి భార్య సుజాత తరుఫున మంత్రి హరీష్ రావు ప్రచారాన్ని హోరెత్తిస్తూ దుబ్బాక ప్రజలకు హామీల వర్షం కురిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి తామే సమవుజ్జి అని చెప్పుకుంటున్న బీజేపీ సైతం దుబ్బాకలో ప్రచార వేడి పెంచింది. దీంతో ఇరుపార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.
ఈనేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీపై ఫైర్ అయ్యారు. దుబ్బాకలో టీఆర్ఎస్ పై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై క్లారిటీ ఇచ్చారు. జూటా 1..జూటా..2 అంటూ జూటా 10వరకు ఆయన బీజేపీ చెప్పిన తప్పుడు ప్రచారాలను మీడియా ఎదుట ఎండట్టారు. బీజేపీ పచ్చి బోగస్.. దివాళా కోరు మాటలు మాట్లాడుతుందని.. ప్రజలు ఏమీ గొర్రెలు కాదని.. దుబ్బాకలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారంటూ మండిపడ్డారు.
Also Read: పోలీసులకు సవాల్‌గా మారిన మిస్సింగ్ కేసులు..
కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చిందా? అంటూ ప్రశ్నించారు. నిజామాబాద్ లో గెలిస్తే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్లు రాసిచ్చారు కదా? ఇప్పటివరకు ఎందుకు తేలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గొర్రెల యూనిట్ ధర కూడా ఎంతో తెలియకుండా బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు జూటా మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందంటూ ఫైర్ అయ్యారు.