https://oktelugu.com/

సుశాంత్ ఫామ్ హౌస్ లోనే డగ్స్ పార్టీలు?

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ ఫుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ కేసును సీబీఐ, ఎన్సీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో దర్యాప్తు ఆ దిశగా కొనసాగుతోంది. దీంతో తీగలాడితే డొంక కదిలిన చందంగా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. Also Read: ‘రకుల్’ పెద్ద పత్తిత్తులా ఫీలైంది.. పాపాలు ఊరికేపోవు ! డ్రగ్స్ కేసును పోలీసులు ఛాలెంజ్ తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2020 / 05:45 PM IST
    Follow us on

    బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ ఫుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ కేసును సీబీఐ, ఎన్సీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో దర్యాప్తు ఆ దిశగా కొనసాగుతోంది. దీంతో తీగలాడితే డొంక కదిలిన చందంగా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

    Also Read: ‘రకుల్’ పెద్ద పత్తిత్తులా ఫీలైంది.. పాపాలు ఊరికేపోవు !

    డ్రగ్స్ కేసును పోలీసులు ఛాలెంజ్ తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పలు సంచలన విషయాలను వెల్లడించింది. సుశాంత్ తో కలిసి తాను కూడా డ్రగ్స్ కు ఫైనాన్స్ చేసినట్లు పోలీసులు ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రియా సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. తాజాగా రియా చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ ను ముంబై ప్రత్యేక కోర్టు కోట్టేసింది.

    దీంతో రియా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. ఈ మేరకు ఆమె డ్రగ్స్ తో సంబంధం ఉన్న 25మంది సెలబ్రెటీల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ బెంబెలెత్తిపోతుంది. డగ్స్ లింకులు టాలీవుడ్ ను కూడా తాకుతుండటంతో చిత్రసీమలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజా రియా చక్రవర్తి పోలీసులు విచారణలో మరో విషయం వెల్లడించినట్లు తెలుస్తోంది.

    Also Read: బిగ్ బాస్-4లో తొలి ఎలిమినేటర్ ఎవరంటే?

    హీరో సుశాంత్ కు ఓ ఫిల్మ్ మేకర్ డ్రగ్స్ అలవాటు చేసినట్లు రియా వెల్లడించింది. ఆ విషయాన్ని సుశాంత్ తనకు స్వయంగా వెల్లడించినట్లు పేర్కొంది. అంతేకాకుండా సుశాంత్ చెందిన లోనాల్వా ఫామ్ హౌజ్లో బాలీవుడ్ కు చెందిన అతని స్నేహితులు డ్రగ్స్ పార్టీలు చేసుకునే వారని చెప్పినట్లు సమాచారం. సదరు ఫిల్మ్ మేకర్ పై డ్రగ్స్ లింకులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అయితే మృతిచెందిన సుశాంత్ పై డ్రగ్స్ ఆరోపణలు వస్తుండటంతో ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.