Mumbai : ముంబైకి తాగునీటి ఎద్దడి.. 29.7 శాతానికి పడిపోయిన నీటి నిల్వలు.. కష్టాలు తప్పవా?

ప్రజలు నీటి వృథా విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే.. బెంగళూర్ లాంటి ఇబ్బందులు ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగళూర్ సమస్య వేసవిలో వచ్చిందని, కానీ ముంబై సమస్య ఎప్పుడూ ఉంటుందని అంటున్నారు. సమీపంలో సముద్రం ఉన్నా.. తాగునీరు, అవసరాలకు పని చేయదని వారు చెప్తున్నారు.

Written By: NARESH, Updated On : July 15, 2024 4:30 pm

Drinking water crisis for Mumbai

Follow us on

Mumbai : చుట్టూ నీరున్నా గొంతు తడుపుకునేందుకు చుక్క కూడా పనికి రాని పరిస్థితి ముంబై నగరానిది. దేశ ఆర్థిక రాజధాని ముంబై గొంతు ఎండబోతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. చుట్టూ సముద్రమే ఉన్నా ఉప్పు నీరు తాగడం కష్టమే కనుక నగరానికి తాగునీరందించేందుకు ఏడు సరస్సులను ఏర్పాటు చేశారు. వర్షాధారంతో పాటు ఫూణె, తదితర మేజర్ సిటీల నుంచి ఇక్కడికి తాగునీటిని తీసుకువచ్చి నగరానికి సరఫరా చేస్తారు. అయితే ఆ నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి.

ఈ వర్షాకాలంలో తొలిసారిగా నగరానికి సేవలందించే ఏడు సరస్సుల్లో నీటి నిల్వలు ఆదివారం (జూలై 14) ఉదయం 29.7 శాతానికి చేరుకున్నాయి. శనివారం ఉదయానికి సరస్సు నీటిమట్టం 25 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగినప్పటికీ.., గతేడాది ఈ తేదీతో పోల్చుకుంటే 10 శాతం తగ్గువగానే ఉందని మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

‘నీటి నిల్వ పరిమాణం పెరగడం అనేది వర్షాలపై ఆధారపడి ఉండవచ్చు. కానీ.. నిరంతరం అది కొనసాగుతూనే ఉండాలి. వర్షపాతంతో సరస్సుల్లో నీటి నిల్వలు మొత్తం 100 శాతంకు దగ్గరగా రావాలి. అప్పుడే లోటును అధిగమించే అవకాశాలుంటాయి. ఉపసంహరించుకోవడం గురించి మేము ఆలోచించగలం’ అని బీఎంసీ అధికారి చెప్పారు.

ఏడు సరస్సుల్లో మొత్తం 14.47 లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వ ఉండాలి.
బీఎంసీ డేటా ప్రకారం, ఆదివారం మొత్తం నీటి నిల్వ 4.3 లక్షల మిలియన్ లీటర్లు. మొత్తం అవసరమైన పరిమాణంతో తీసుకుంటే 29.7%. మొత్తం నీటి నిల్వ జూలై 14, 2023 వ తేదీ నమోదైన పరిమాణానికి సమానంగా ఉన్నప్పటికీ, 2022 లో ఇదే రోజుతో పోలిస్తే చాలా తక్కువ. సుమారు 9.5 లక్షల మిలియన్ లీటర్లు లేదా మొత్తం అవసరమైన పరిమాణంలో 65.8% తక్కువగా ఉంది.

ముంబైకి తాగునీటిని సరఫరా చేసే అతిపెద్ద సరస్సుల్లో ఒకటైన ‘భట్సా’లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 28.7% ఉపయోగించేందు నీరు ఉంది. చిన్న సరస్సులైన ‘విహార్’, ‘తులసి’ వరుసగా 52.1%, 91.4% నీటి నిల్వలను కలిగి ఉన్నాయి. ఎగువ ‘వైతర్నా’లో 1.9 శాతం, ‘మోదక్ సాగర్’ లో 45.7 శాతం, ‘తాంస’లో 60.9 శాతం, ‘మిడిల్ వైతర్నా’లో 27.1 శాతం నీటి నిల్వ ఉంది. భట్సా నుంచి 1.4 లక్షల మిలియన్ లీటర్లు, ఎగువ వైతర్నా నుంచి 91,130 మిలియన్ లీటర్ల నీటిని తీసుకోవడాన్ని బీఎంసీ నిలిపివేసిందని అధికారులు తెలిపారు.

ఏడు సరస్సుల్లో అత్యధిక శాతం తాగునీటిని భట్సా (48%) ముంబైకి సరఫరా చేస్తుంది. తులసి, విహార్ నగర తాగునీటి అవసరాలలో సుమారు 2%, ఎగువ వైతర్నా 16%, మిడిల్ వైతర్నా 12%, మోదక్ సాగర్ 11%, తాంసా 10% సరఫరా చేస్తున్నాయి.

అయితే ఈ సారి నీటిని కొంత పొదుపుగా వాడుకోవాలని ముంబై వాటర్ వర్క్స్ ఇంజినీరింగ్ అధికారులు నగర ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ప్రాణాధారమైన నీటిని వృథా చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒక్క రోజు నీటిని రెండు రోజులకు సరపడా పొదుపుగా వాడాలంటున్నారు. ఆశించిన మేర వర్షాలు పడితే ఇబ్బందులు ఉండకపోవచ్చని చెప్తున్నారు. ఇప్పటి వరకైతే సరఫరా విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదని చెప్తున్నారు.

ప్రజలు నీటి వృథా విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే.. బెంగళూర్ లాంటి ఇబ్బందులు ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగళూర్ సమస్య వేసవిలో వచ్చిందని, కానీ ముంబై సమస్య ఎప్పుడూ ఉంటుందని అంటున్నారు. సమీపంలో సముద్రం ఉన్నా.. తాగునీరు, అవసరాలకు పని చేయదని వారు చెప్తున్నారు.