Homeజాతీయ వార్తలుIndia's First Photonic Radar: భారత్‌ అమ్ముల పొదిలో మరో ఆయుధం.. చైనా, పాకిస్తాన్‌కు ఇక...

India’s First Photonic Radar: భారత్‌ అమ్ముల పొదిలో మరో ఆయుధం.. చైనా, పాకిస్తాన్‌కు ఇక దబిడిదిబిడే!

India’s First Photonic Radar: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌.. మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటింది. మన ఆయుధాలకు డిమాండ్‌ పెరిగింది. గ్రీస్, సైప్రస్‌తోపాటు అనేక దేశాలు భారత ఆయుధాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక భారత్‌కు కూడా శత్రువులు పెరుగుతున్నారు. పాకిస్తాన్, చైనాతోపాటు కొత్తగా టర్కీ, బంగ్లాదేశ్‌ కూడా చేరాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆయుధాలు, కొత్త టెక్నాలజీని భారత్‌ సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో కొత్త పరిజ్ఞానం భారత రక్షణ అమ్ములపొదిలో చేరింది.

భారత్‌ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, ఫొటానిక్‌ రాడార్‌ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఈ అధునాతన సాంకేతికత శత్రువుల గగనతల దాడులను ముందుగా, స్పష్టంగా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. బెంగళూరులోని డీఆర్డీవో ల్యాబ్‌లో రూపొందిన ఈ రాడార్, స్టెల్త్‌ యుద్ధవిమానాలు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్‌ జామింగ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సంప్రదాయ రేడియో ఫ్రీక్వెన్సీ రాడార్లు 1940 నుంచి వాడుకలో ఉన్నాయి. అవి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలతో లక్ష్యాలను గుర్తిస్తాయి కానీ, స్టెల్త్‌ యుద్ధవిమానాలు, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను గుర్తించడంలో పరిమితులను ఎదుర్కొంటాయి. ఫొటానిక్‌ రాడార్, కాంతి ఆధారిత తరంగాలను (లేజర్లు, ఆప్టికల్‌ ఫైబర్లు) ఉపయోగించి, వేగవంతమైన, కచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ఇది విస్తృత బ్యాండ్‌విడ్త్‌తో పనిచేస్తూ, సంప్రదాయ రాడార్ల పరిమితులను అధిగమిస్తుంది.

స్టెల్త్, జామింగ్‌కు చెక్‌
ఫొటానిక్‌ రాడార్‌ యొక్క ప్రధాన బలం దాని స్టెల్త్‌ యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించే సామర్థ్యం. శత్రువులు ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యూహాలు ఈ రాడార్‌పై పనిచేయవు. అదనంగా, ఇది బహుళ లక్ష్యాలను 3డీలో స్పష్టంగా పరిశీలించగలదు, ఇది రక్షణ మరియు నిఘా కార్యకలాపాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: CJI పదవీ విరమణ తర్వాత ప్రైవేట్ నివాసానికి మారాలా? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?

సాంకేతిక ప్రయోజనాలు..

– ఫొటానిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు సంకేతాలను వేగంగా విశ్లేషిస్తాయి, తక్కువ నష్టంతో ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి.

– సంప్రదాయ రాడార్లతో పోలిస్తే, ఫొటానిక్‌ రాడార్లు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి, ఇది వాటి సామర్థ్యాన్ని పెంచుతుంది.

– బహుళ తరంగ దైర్ఘ్యాల్లో పనిచేయడం వల్ల ఈ రాడార్లు విభిన్న రకాల లక్ష్యాలను గుర్తించగలవు.

మరిన్ని పరీక్షలు..
డీఆర్డీవో రూపొందించిన ఈ ఫొటానిక్‌ రాడార్‌పై విస్తృత పరీక్షలు నిర్వహించనుంది. పర్వత, తీర ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ రాడార్‌ను సుఖోయ్‌–30ఎంకేఐ, రఫేల్, తేజస్‌ వంటి యుద్ధవిమానాలతో అనుసంధానం చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని చిన్న పరిమాణం సంచార వేదికలపై సులభంగా మోహరించే అవకాశాన్ని కల్పిస్తుంది, ముఖ్యంగా చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది.

Also Read: బంగ్లాదేశ్‌ పవర్‌ కట్‌.. దెబ్బకు దారికొచ్చిన యూనస్‌ ప్రభుత్వం!

భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనం
చైనా యొక్క ఒ–20 స్టెల్త్‌ యుద్ధవిమానాలు, పాకిస్తాన్‌ డ్రోన్‌లు సంప్రదాయ రాడార్లను ఏమార్చేందుకు రూపొందించబడ్డాయి. ఫొటానిక్‌ రాడార్‌ ఈ వ్యూహాలను నిరోధించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది హైపర్‌సోనిక్‌ అస్త్రాలను కూడా గుర్తించగలదు, ఇది భారత్‌కు వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ సాంకేతికత అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌ వంటి దేశాల సరసన భారత్‌ను నిలబెడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular