ఆంధ్రప్రదేశ్ లో సీఎం మానసపుత్రికగా భావించిన గ్రామ సచివాలయ వ్యవస్థ మనుగడపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలులో సౌకర్యంగా ఉండాలని గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ప్రతి 2వేల ఇళ్లకో సచివాలయం, 50 ఇళ్లకో వాలంటీర్ చొప్పున కేటాయించారు. ప్రస్తుతం ఈ వ్యవస్త ఉనికికి పెద్ద ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉంది. సర్పంచులు, గ్రామకార్యదర్శల హవా కొనసాగే పంచాయతీల్లో సచివాలయాల రాకతో పరిస్థితి మారిపోయింది. దీంతో హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు ఓ మలుపుగా చెప్పుకోవచ్చు.
గ్రామపంచాయతీల్లో ఇప్పటివరకు సర్పంచులు, గ్రామ కార్యదర్శులు చెలాయిస్తున్న అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీచేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకుకొచ్చిన జీవోనెం.2ను హైకోర్టు కొట్టేసింది. రెవెన్యూ వ్యవస్థలో భాగమైన పంచాయతీల్లో సర్పంచులు, కార్యదర్శులకు చెక్ పెట్టేందుకు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో జీవోనెం 2ను కొట్టేయడంతో ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోలేదనే విషయం తెలుస్తోంది.
సచివాలయ వ్యవస్థపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన పంచాయతీలు ఉండగా సచివాలయ వ్యవస్థ ఎందుకని అడిగింది. సచివాలయ వ్యవస్థ ద్వారా పంచాయతీల అధికారాలు, ఉనికికే ప్రమాదం పొంచి ఉందని సూచించింది. సంక్షేమ పథకాల అమలు కోసమని ప్రభుత్వం చెప్పినా అది సహేతుకంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తాజాగా పంచాయతీల అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది. దీంతో సచివాలయ వ్యవస్థపై హైకోర్టు తుది తీర్పులో ఏ మేరకు స్పందిస్తుందో అని వేచి చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాల అమలు మరింత మెరుగ్గా ఉండేలా చూస్తామని ప్రభుత్వం చెప్పినా అది ముమ్మాటికి సమంజసం కాదని చెప్పింది. సచివాలయ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా పంచాయతీ వ్యవస్థను తొక్కి పట్టడమే అని పేర్కొంది. సచివాలయాలను అమల్లోకి తీసుకొచ్చి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని తెలిపింది. సచివాలయ వ్యవస్థపై త్వరలో హైకోర్టు ఓ నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
పంచాయతీలు ఉండగా సచివాలయాల అవసరమేమని ప్రశ్నించింది. వీఆర్వోలకు అధికారాలు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది. హైకోర్టు జీవో నెం.2ను కొట్టేసినా మరో జీవో తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సచివాలయ వ్యవస్థ తప్పనిసరిగా కొనసాగించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారాల విషయంలో పంచాయతీ, రెవెన్యూ మధ్య వివాదాలు కొనసాగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.