Revanth Reddy: ఇంతకాలం ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఖళీగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బిజీ అయ్యారు. పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్ర త్వరలో రాష్ట్రంలోకి రాబోతోంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలకు నోటిషికేషన్ వచ్చి.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీనియర్ నాయకులు రెండు టాస్క్‌లను ఎలా ఎదుర్కొవాలని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ను మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా ఎదర్కొనాలో తెలియక ఇప్పటికే కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ తరుణంలోనే రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి ఎంటర్ కాబోతోంది. మరోవైపు ఆర్థిక కష్టాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. నిధుల సమీకరణకు నేతలు పాట్లు పడుతున్నారు.

పక్షం రోజులు రాహుల్ యాత్ర..
మునుగోడు ఉపఎన్నిక కీలక దశలో ఉన్నప్పుడు రాహుల్ తెలగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపుగా15 రోజులపాటు సాగే ఆయన పాదాయాత్ర అయిపోయే సరికి మునుగోడులో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. ఈ క్రమంలో నేతలంతా రాహుల్ గాంధీ టూర్‌లో బీజీగా ఉంటారు. రాహుల్ పర్యటన మొదలు కాకముందే.. నేతలంతా రాహుల్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. మునుగోడు ప్రచారారికి వెళ్లడం లేదు. ఇక ఆయన ఎంట్రీ ఇస్తే ఇప్పుడ ప్రచారానికి వెళ్తున్న నేతలు కూడా మునుగోడు వైపు కన్నెత్తి చేసే అవకాశం ఉండదని పార్టీ నాయకులు చెబుతున్నారు.
రాహృల్ దృష్టిలో పడేందుకు తాపత్రయం..
భారత జోడో యాత్రలో భాగంగా రాష్ట్రంలోకి వచ్చే రాహుల్ దృష్టిలో పడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా తంటాలు పడుతున్నారు. ఢిల్లీ వెళ్లిన దర్శనమివ్వని రాహుల్ ఇప్పుడు రాష్ట్రంలో పక్షం రోజులపాటు పాదయాత్ర చేయనుండడంతో ఆయన దృష్టిలో ఎలాగైనా పడాలని సినియర్లంతతా భావిస్తున్నారు. ఆయనతో కలిసి నడవడానికి ఎవరికివారు ప్లాన్ చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీ, పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం రాహుల్ పాదయాత్రకు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఆయన విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఆయన ఇక కాంగ్రెస్‌కు లేనట్లేనని ఫిక్సయిపోతున్నారు.

పాదయాత్ర దారిలో పీసీసీ ప్రెసిడెంట్.
ఇక టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పాదయాత్రను సమన్వయం చేసుకోవాలి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకోవాలి. ఈ పనుల్లో ఉంటూనే మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. ఇక ముందు ఆ అవకాశం ఉండదు. అసలే మునుగోడులో టీఆర్‌ఎస్, బీజేపీ .. యుద్ధం చేసుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రేసులో లేదని చెప్పడానికి ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. కనీసం అలా కాదు.. తాము రేసులో ఉన్నామని చెప్పుకోవడం కోసమైనా కాంగ్రెస్ పార్టీ.. మునుగోడులో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ విషయం టీపీసీసీ అధ్యక్షుడికి డబుల్ టాస్క్‌గా మారింది. వీటిని రేవంత్ ఎలా అధిగమిస్తారో చూడాలి మరి.