https://oktelugu.com/

CM KCR: అభ్యర్థులను చూడొద్దట.. పార్టీలను చూసి ఓటెయమంటున్న కేసీఆర్‌!

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఒకటి చెప్తండు.. పీసీసీ చీఫ్‌ ఇంకోటి చెప్పండు.. ఆలోచించి ఓటెయ్యాలి అంటూ ఊకదంపుడు, ఆవుకథ ప్రసంగం కొనసాగిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 14, 2023 6:54 pm
    CM KCR

    CM KCR

    Follow us on

    CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్‌.. ప్రచారాన్ని కూడా అందరికంటే ముందే మొదలు పెట్టారు. ఇప్పటికే రెండు విడతల ప్రచారం పూర్తిచేసుకున్న కేసీఆర్‌.. ఈనెల 13 నుంచి మూడో విడత ప్రచారం మొదలు పెట్టారు. దాదాపు ఇప్పటి వరకు 45కుపైగా ప్రచార సభలు నిర్వహించారు. కానీ, కొత్తదనం లేని ప్రసంగంలో ప్రచార సభలు వెలవెలబోతున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఆశాజనకంగా లేదు. పాడిందే పాడరా అన్నట్లు.. రైతుబంధు ఇస్తున్నం.. ధరణి వద్దట, ఉచిత విద్యుత్‌ ఇస్తున్నం.. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఒకటి చెప్తండు.. పీసీసీ చీఫ్‌ ఇంకోటి చెప్పండు.. ఆలోచించి ఓటెయ్యాలి అంటూ ఊకదంపుడు, ఆవుకథ ప్రసంగం కొనసాగిస్తున్నారు.

    తమ అభ్యర్థులు మంచోళ్లు కాదని..
    ఇక కేసీఆర్‌ తాను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మంచివారు కాదని ప్రచార సభల్లో చెప్పకనే చెబుతున్నారు. అభ్యర్థులను మార్చాలని పార్టీ సీనియర్లు, ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్‌కిశోర్‌ చెప్పినా నేను మోనార్క్‌ అన్నట్లు కేవలం పది మంది అభ్యర్థులను మార్చి పాత కాపులతోనే ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు ప్రచార సభల్లో అభ్యర్థులపై తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కేసీఆర్‌ తన ప్రసంగంలో ఇప్పుడు అభ్యర్థులను చూడొద్దని, పార్టీలను చూడాలని అభ్యర్థిస్తున్నారు. ‘‘బీఆర్‌ఎస్‌ నుంచి ఒకలు ఉంటరు.. బీజేపీ నుంచి ఇంకొకలు ఉంటరు.. కాంగ్రెస్‌ నుంచి మరొకరు ఉంటరు.. ఇంకో నలుగురైదుగురు కూడా పోటీలో ఉంటరు.. అభ్యర్థులను చూడద్దు.. వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. ఏ పార్టీ ఏం చేసిందని ఆలోచించాలి.. ఊళ్లలో చర్చకు పెట్టాలి’’ అని కోరుతున్నారు.

    పరోక్ష సంకేతం..
    తమ పార్టీ అభ్యర్థుల్లో చాలా వరకు వ్యతిరేకత ఉందని, మార్చకపోవడం పొపాటు జరిగిందని కేసీఆర్‌ తన ఎన్నికల ప్రసంగంలో పరోక్ష సంకేతం ఇస్తున్నారు. ఇంకోవైపు అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత గెలపు తీరం చేరుస్తుందా, పుట్టి ముంచుతుందా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే డిసెంబర్‌ 3వ తేదీ వరకు వేచి చూడాలి.