
మాములుగా అన్నదమ్ములు కలిసుండడం అంటే కష్టమే. ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వచ్చి అవి గొడవలకు దారి తీస్తాయి. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న మెగా బ్రదర్స్ మాత్రం రామలక్ష్మణులుల్లా కలిసుంటారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అన్యోన్యంగా సాగుతారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మాటను జవదాటకుండా ఇద్దరు తమ్ములు నడుచుకుంటారు. అయితే రాజకీయంగా మాత్రం వీరి మధ్య విభేదాలు వస్తున్నాయా..? ఒకప్పుడు తమ్ముడు జనసేన పార్టీకి సహకరిస్తామని చెప్పిన బ్రదర్స్ ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకుంటున్నారా..?
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటులు కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాణించలేకపోయారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే ఉన్నారు. రాజకీయ విషయాలను అస్సలు పట్టించుకోకుండా సినిమాలకే పరిమితమయ్యారు. అయితే 2019 ఎన్నికల తరువాత ఏపీ సీఎం జగన్ కు చిరంజీవి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఎన్నడూ ఆయనపై విమర్శలు చేయకుండా నడుచుకుంటున్నారు. ఒక సందర్భంలో చిరంజీవి దంపతులు సీఎం ఇంటికి విందుకు కూడా వెళ్లారు.
అయితే ఇటీవల వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని మెగాస్టార్ మెచ్చుకున్నారు కూడా.. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించనప్పటి నుంచీ జగన్ కు వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ప్రత్యక్షంగా కలిసిందీ లేదు. అంతేకాకుండా నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇక సోషల్ మీడియాలో నైతే పవన్ వర్సెస్ జగన్ వార్ కొనసాగతూనే ఉంటుంది.
తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో చిరంజీవి కామెంట్లపై పవన్ ఫ్యాన్స్ కొస్త అసహనం వ్యక్తం చేస్తున్నారట. తాము ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే చిరంజీవి ఇలా మెచ్చుకోవడంపై అయోమయానికి గురవుతున్నారు. అయితే పవన్ మీద ఉన్న అభిమానంతో చిరంజీవిని కూడా ట్రోలింగ్ చేస్తున్నారట. ఇక ఈ మధ్య నాగబాబు పవన్ పార్టీ పేరు చెప్పడంలో తడబడ్డాడట. దీంతో ఆయనపై కూడా జనసేన ఫ్యాన్స్ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే పర్సనల్ గా ఎన్ని ఉన్నా రాజకీయంలోకి వచ్చేసరికి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని కొందరు అంటున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ పై ఈగ వాలనీయకుండా చూసుకుంటున్నారు.