కరోనాను జయించినా.. వివక్ష కొనసాగుతుందా?

మనం పోరాడాల్సింది కరోనా(కోవిడ్-19)తోగానీ.. రోగితో కాదు.. ఈ విషయంపై వైద్యులు, సామాజిక సంస్థలు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా.. ఎవరీలో మార్పురాకపోవడం శోచనీయంగా మారుతోంది. ప్రజలు కరోనా రోగులను దూరం పెడుతున్నారంటే ఓ అర్థం ఉందిగానీ.. కరోనాను జయించిన వారిపట్ల సమాజంలో వివక్ష కొనసాగుతుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది. అసలు ప్రభుత్వాలు కరోనాపై సరైన రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనాను జయించామని సంతోషపడేలోపే చుట్టూ ఉండే ప్రజలు చూపే వివక్షతతో వారంతా మానసిక ఒత్తిడులకు […]

Written By: Neelambaram, Updated On : August 14, 2020 8:47 pm
Follow us on


మనం పోరాడాల్సింది కరోనా(కోవిడ్-19)తోగానీ.. రోగితో కాదు.. ఈ విషయంపై వైద్యులు, సామాజిక సంస్థలు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా.. ఎవరీలో మార్పురాకపోవడం శోచనీయంగా మారుతోంది. ప్రజలు కరోనా రోగులను దూరం పెడుతున్నారంటే ఓ అర్థం ఉందిగానీ.. కరోనాను జయించిన వారిపట్ల సమాజంలో వివక్ష కొనసాగుతుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది. అసలు ప్రభుత్వాలు కరోనాపై సరైన రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనాను జయించామని సంతోషపడేలోపే చుట్టూ ఉండే ప్రజలు చూపే వివక్షతతో వారంతా మానసిక ఒత్తిడులకు గురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఎంపీ Vs ఎమ్మెల్యే! మరోసారి వివాదం షురూ..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహ్మమరి పంజా విసురుతోంది. కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కంటికి కన్పించకుండా కరోనా దాడిచేస్తుండటంతో ప్రజలు వీలైనంత వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం.. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా ప్రజల్లో మాత్రం కరోనాపై అపోహలు మాత్రం వీడడం లేదని తెలుస్తోంది.

కరోనా బారిన పడిన వారికి ప్రభుత్వం కోవిడ్ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తోంది. సల్ప లక్షణాలు ఉన్నవారికి మాత్రం హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరంతా కూడా కొద్దిరోజులు వైరస్ తో పోరాడి కోలుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి పట్ల కూడా ప్రజలు వివక్ష చూపుతుండటం గమనార్హం. కరోనాను జయించి ఇంటికొచ్చిన వారిపట్ల చుట్టుపక్కల వాళ్లు.. సన్నిహితులు, బంధువులు తమతో ఇంతక ముందుగా వ్యవహరించడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. తమను శత్రువులా చూస్తుండటం ఎంతో బాధకు గురిచేస్తుందని పలువురు కరోనా పేషంట్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Also Read: మంత్రిగారి ‘కరోనా’ దోపిడీ.. పిండేస్తున్నాడట!

నిన్నటి వరకు కలిసి తిరిగిన వారంతా తమను చూస్తేనే భయపడిపోతుండటం ఆవేదన కలిగిస్తుందంటున్నారు. మరికొందరు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. కరోనా భయం కంటే ఇతరుల చూపించే వివక్షే తమను మానసిక ఆందోళన కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రజలకు ఈ వ్యాధిపట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే కరోనాను జయించినా వారిపట్ల కూడా పలువురు వివక్ష చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

వైద్యులు ఎంతో శ్రమించి కరోనా సోకిన వారిని బ్రతికిస్తుంటే.. చుట్టురా ఉండేవాళ్లు వారిపట్ల వివక్ష చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరుగకుండా తొలినాళ్లలోనే వీటికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టాలని వైద్యులు కోరుతున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతుందని అంటున్నారు.. దీనివల్ల మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కరోనా వ్యాధిపై ప్రజలకు ఉన్న భయాందోళనలు దూరం చేసేలా మరింత అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.