హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…?

చంద్రబాబు స్థాపించిన ఏపీ రాజధాని అమరావతి కి బదులుగా జగన్ మూడు రాజధానుల ప్రపోజల్ పెట్టి దానిని ఎంతమంది వద్దంటున్నా…. పట్టుబట్టి మరీ.. ఏకంగా గవర్నర్ నుండి ఆమోదం తెచ్చుకున్న తరువాత కూడా రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతోందని ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని తాను అనుకోవడం లేదని అమరావతిని రాజధానిగా తన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రకటించిన జగన్…. అధికారంలోకి […]

Written By: Kusuma Aggunna, Updated On : August 14, 2020 8:32 pm
Follow us on

చంద్రబాబు స్థాపించిన ఏపీ రాజధాని అమరావతి కి బదులుగా జగన్ మూడు రాజధానుల ప్రపోజల్ పెట్టి దానిని ఎంతమంది వద్దంటున్నా…. పట్టుబట్టి మరీ.. ఏకంగా గవర్నర్ నుండి ఆమోదం తెచ్చుకున్న తరువాత కూడా రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతోందని ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని తాను అనుకోవడం లేదని అమరావతిని రాజధానిగా తన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రకటించిన జగన్…. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్లేటు ఫిరాయించి…. ప్రతిపక్షం నుంది అత్యంత తీవ్రమైన విమర్శలు ఎదురుకుంటున్నాడు. 

అంతేకాకుండా కోర్టువారు కూడా జగన్ కు వ్యతిరేకంగా వరుసబెట్టి తీర్పులు ఇవ్వడం మొదలు పెట్టేశారు. దీంతో జగన్…. తన దగ్గర ఉన్న ప్లాన్ బి ను బయట బయటపెట్టవలసి వచ్చింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే…. మూడు రాజధానుల నిర్ణయం పై స్టే విధించిన హైకోర్టు విచారణ సందర్భంగా రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల సంగతి ఏమిటని…. జగన్ సర్కార్ ను కచ్చితంగా అడుగుతుందని…. అప్పుడు ప్రభుత్వం ఇరుకున పడకుండా జగన్ ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారని సమాచారం. అమరావతిని ‘మెట్రోపాలిటన్ సిటీ’ గా అభివృద్ధి చేయనున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన జగన్… ఈ విషయమై తాజాగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

అమరావతిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు…. ఇంకా ఇతర నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో…. వాటిని ఏవిధంగా మెట్రోపాలిటన్ సిటీ కి ఉపయోగించుకోవాలో…. అలాగే రైతుల ఫ్లాట్లను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై అధికారులతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. రాజధానికి ఏ మాత్రం తీసిపోకుండా మెట్రోపాలిటన్ సిటీని తాము తయారు చేస్తామని హైకోర్టు ముందు జగన్ రైతులకు హామీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి హైకోర్టు వారు అందుకు జరగాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యే వరకైనా రాజధాని తరలించే అవకాశం లేదని జగన్ కు షాక్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి జగన్ వేసుకున్న ప్లాన్ – బి హైకోర్టుకి నప్పుతుందా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం.