https://oktelugu.com/

ఎస్పీ బాలసుబ్రణ్యం ఆరోగ్యం పై అధికార రిపోర్టు ఇదిగోండి…! విషయం ఏమిటంటే….

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వార్త బయటకు వచ్చింది. ఈ నెల 5వ తేదీన కరోనా బారిన పడిన ఎస్పీ బాలు గారు తన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక ఆడియో మెసేజ్ ద్వారా వివరించారు. తనకు కరోనా పాజిటివ్ రావడం తో చికిత్స తీసుకుంటున్నాను అని…. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే అప్పటి వరకు సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న బాలుగారు గురువారం రాత్రి ఆరోగ్య […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 14, 2020 / 07:18 PM IST
    Follow us on

    ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వార్త బయటకు వచ్చింది. ఈ నెల 5వ తేదీన కరోనా బారిన పడిన ఎస్పీ బాలు గారు తన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక ఆడియో మెసేజ్ ద్వారా వివరించారు. తనకు కరోనా పాజిటివ్ రావడం తో చికిత్స తీసుకుంటున్నాను అని…. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే అప్పటి వరకు సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న బాలుగారు గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వెంటిలేటర్ సపోర్టు శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేశారు.

    చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో ఐదు రోజులుగా ఉన్న బాలు గారు స్వల్ప లక్షణాలతో చేరిన తర్వాత ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమేపి విషమించింది. ఇక ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు వైజాగ్ నుండి అతని ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. వెంటిలేటర్ ద్వారా ఆయన చికిత్స తీసుకుంటున్నారని…. ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వయసురీత్యా వస్తున్న ఆరోగ్యసమస్యల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయని…. కరోనా తీవ్రత పెరగడానికి కూడా అదే కారణమని వైద్యులు చెబుతున్నారట. 

    ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలియడంతో తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు అతని కుమారుడితో పాటుగా ఆసుపత్రి వర్గాల తో కూడా మాట్లాడుతున్నారు. 74 ఏళ్ల వయసు ఉన్న ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం అతని అభిమానులను నిజంగా అందోళన పెడుతోంది. ఇక సినీ రంగ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు అతను ఆరోగ్యంగా తిరిగి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.