
ABN RK- Chandrababu: మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక శాసనసభ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి ఉత్సాహం మీద ఉన్న టిడిపి శ్రేణులను ఆర్కే నేలకు దించాడు..అబ్బే…ఈ విజయం జస్ట్ ఓ జుజుబి అని హేళన చేశాడు. వాస్తవానికి ఆర్కే చంద్రబాబు ఫోల్డ్ లో మనిషి.. చంద్రబాబుకు బాగా కావాల్సిన మనిషి.. పచ్చ మీడియాలో కీలకమైన మనిషి. ఆ ఈనాడు రామోజీరావు మధ్యలో కొన్ని సార్లు కాడి ఎత్తేసినప్పటికీ, టీడీపీని మోసిన, మోస్తున్న వ్యక్తి..కానీ అలాంటి రాధాకృష్ణ టిడిపి విజయాన్ని గాలివాటం లాగా తేల్చేయడమే ఇక్కడ ప్రధాన ప్రశ్న.
అధికార వైఎస్ఆర్సిపి ఆరోపించినట్టు నలుగురు ఎమ్మెల్యేలను టిడిపి కొనుగోలు చేసిందా? దానిని సమర్ధించినట్టుగానే ఆర్కే వ్యాఖ్యలు ఉన్నాయా? దీనికి అవును అనే సమాధానం చెబుతోంది సండే కొత్త పలుకు. దీంతో ఇన్నాళ్ళు ఓటముల్లో ఉండి, జగన్ కొడుతున్న దెబ్బలకు అలసి పోయిన టీడీపీ నాయకులకు, ముఖ్యంగా శపథాలు చేసిన చంద్రబాబుకు మరింత బూస్టర్ ఇచ్చేలాగా ఆర్కే వ్యాఖ్యలు ఉండాలి. అదేంటో గానీ ఈ మాత్రం విజయంతో సంబరపడిపోకండి అంటూ చురక అంటించాడు. సహజంగానే ఇలాంటి వ్యాఖ్యలు ఆర్కే నుంచి రావు. టీడీపీ కి వ్యతిరేకంగా అస్సలు రావు. కానీ సడన్ గా ఇలా రాసేసరికి టిడిపిలో ఒక కలవరం..ఒక ఆవేదన.

నిజంగానే ఇది ఒక గెలుపు కాదా! టీడీపీ శ్రేణులు కష్టపడలేదా? ఆర్కే ఎందుకు అంత లైట్ తీసుకున్నాడు? సంబరాలు వద్దూ అని ఎందుకు వారిస్తున్నాడు? గెలుపు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఓటమి గెలుపునకు దారులు పరుస్తుంది. ఇప్పుడు ఈ గెలుపుతో 2024 లో అధికారంలోకి రావాలి అని చంద్రబాబు అనుకుంటుంటే… తగుదునమ్మా అంటూ మధ్యలో వచ్చిన ఆర్కే.. చంద్రబాబు ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నాడు. తెలంగాణలో షర్మిలకు సపోర్ట్ ఇచ్చినట్టు..జగన్ తో కూడా ఆర్కే సంధి కుదుర్చుకున్నాడా? అందుకే బాబును ఇలా హేళన చేస్తున్నాడా?!