
NTR- Lakshmi Pranathi: యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి మీద తన ప్రేమను చాటుకున్నారు. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఆమెతో దిగిన ఓ రొమాంటిక్ ఫోటో షేర్ చేశారు. లక్ష్మి ప్రణతి బర్త్ డే విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది. లక్ష్మి ప్రణతి చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. టాప్ స్టార్ వైఫ్ అయినప్పటికీ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న దాఖలాలు లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ పోస్ట్స్ పెట్టరు. ఎన్టీఆర్ తో పాటు చాలా అరుదుగా బయటకు వస్తారు.
2023 న్యూ ఇయర్ వేడుకల కోసం ఎన్టీఆర్ భార్యా పిల్లలతో అమెరికా వెళ్లారు. అప్పుడు ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి టూర్ ఫోటోలు వైరల్ అయ్యాయి. మోడరన్ డ్రెస్ లలో లక్ష్మి ప్రణతి తనలోని కొత్త యాంగిల్ పరిచయం చేసింది. 11 ఏళ్లుగా ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి లవ్లీ కపుల్ గా ఉన్నారు. 2011 మే 5న వీరి వివాహం జరిగింది. వ్యాపారవేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తెనే లక్ష్మి ప్రణతి. వీరికి చుట్టరికం కూడా ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ దంపతులకు ఇద్దరు కుమారులు. అభయ్ రామ్ పెద్దవాడు కాగా భార్గవ్ రామ్ చిన్నబ్బాయి పేరు.
మరోవైపు ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ మూవీకి సిద్ధం అవుతున్నారు. మార్చి 23న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్ ఇండియా వైడ్ న్యూస్ అయ్యింది. శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమెను సౌత్ కి తేవాలన్న ప్రయత్నాలు ఎన్టీఆర్ 30తో సాకారమయ్యాయి. ఓ బలమైన కథలో ఆమె పాత్ర చాలా కీలంగా ఉంటుందని కొరటాల శివ వెల్లడించారు.

అతి త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టబోతున్నారు. కేవలం ఏడాదిలో ఎన్టీఆర్ 30 పూర్తి చేసి విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ 30 చిత్రం 2024 ఏప్రిల్ 5 విడుదల తేదీగా ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతం ప్రధాన నేపథ్యంగా ఎన్టీఆర్ 30 మూవీ సాగుతుందని కొరటాల చెప్పారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పని చేస్తున్నారని సమాచారం.