Telangana News: ప్రజెంట్ మనం టెక్నాలజీ వరల్డ్‌లో ఉన్నామని చాలా మంది చెప్తుంటారు. అది నిజమే. అంత మాత్రం చేత మూఢ నమ్మకాలు కంప్లీట్‌గా పోయాయని అనుకుంటే పొరపడినట్లేనన్న సంగతి ఇటీవల జరిగిన ఘటనలు నిరూపిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ ఎక్కడో జనంలో ఇంకా పిచ్చి నమ్మకాలు ఉన్నాయి. వాటి ఆధారంగా కొందరు దొంగ బాబాల అవతారమెత్తి అమాయక జనాలను మోసం చేస్తున్నారు. అటువంటి ఘటనే తాజాగా జరిగింది.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. కమ్మదనం గ్రామ శివారులో అనంతపురం ప్రాంతానికి చెందిన శివస్వామి అనే ఓ వ్యక్తి కొంతకాలంగా ఉంటున్నాడు. ఓ ప్రైవేటు వెంచర్‌లో ఇల్లు కట్టుకున్న ఇతను.. అందులో కాళికామాత విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పూనకాలు వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ప్రజలను భయపెడుతున్నాడు. గతంలో ఇతను మధురాపూర్‌లో ఇలానే చేయగా ఆ గ్రామస్తులు బెదిరించడంతో ఇక్కడకు వచ్చాడు. అలా ఇక్కడకు వచ్చిన క్రమంలో ఓ యువతిని మోసం చేశాడు. ఆమె దగ్గరి నుంచి వేల రూపాయలు తీసుకున్నాడు. క్షుద్రపూజలు చేసి ఆమె దోషాలు నివారిస్తానని చెప్పి ఆమె దగ్గరి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆమె పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన కంప్లయింట్ ద్వారా బయటపడ్డాయి.
Also Read: లక్ష రూపాయల పెట్టుబడికి రూ.30 లక్షల రూపాయలు.. ఎలా అంటే?
తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగా లేవని ఓ యువతి దొంగ స్వామిజీ వద్దకు వెళితే వేల రూపాయలు తీసుకుని ఆ స్వామిజీ సదరు యువతిని మోసం చేశాడు. క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియోలను సదరు యువతి పోలీసు స్టేషన్‌లో ఇచ్చింది. సదరు వీడియోల్లో యువతి కళ్లలో అతడు నిమ్మకాయ రసం పిండటంతో పాటు పిడి గుద్దులు గుద్దాడు. ఈ క్రమంలోనే దొంగ స్వామిజీని శిక్షించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు యువతి పోలీసులకు తెలిపింది.
తాను సదరు వ్యక్తి చేతిలో మోసపోయానన్న సంగతి తర్వాత కాలంలో తనకు తెలిసిందని యువతి పేర్కొంది. షాద్ నగర్ చుట్టు పక్క గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా దొంగ స్వామిజీ చేతిలో మోసపోయారని సమాచారం. చుట్టు పక్క ప్రాంతాల వారి వద్ద నుంచి క్షుద్రపూజల నెపంతో దొంగ స్వామిజీ చాలానే డబ్బులు వసూలు చేశాడట. దొంగ స్వామిజీ కేసును పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: తెలంగాణలో వెలుగుచూస్తున్న కోవిడెంగ్యూ కేసులు