Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది జరుగబోతున్నాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షడిగా ఉన్నారు. ఈఏడాది చివరికి ఆయన పదవీకాలం ముగియనుంది. డెమొక్రటిక్ అభ్యర్థిగా మళ్లీ ఆయనే పోటీచేసే అవకాశం ఉంది. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎవరనేది మాత్రం నిర్ణయించలేదు. ఆ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు, నిక్కీహేలీ, వివేక్ రామస్వామి, రాన్ డీశాంటీస్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు అయోవా రాష్ట్రంలో సోమవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో రాన్ డీశాంటీస్ ఉండగా, మూడు, నాలుగో స్థానాల్లో నిక్కీహేలీ, వివేక్ రామస్వామి నిలిచారు.
వివేక్‌కు దక్కని అయోవాల మద్దతు..
ఎప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినా పార్టీ అభ్యర్థి కోసం అయోవా రాష్ట్రంలో ప్రాథమిక ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ద్వారానే డెమొక్రట్లు, రిపబ్లికన్లు అభ్యర్థిని ఎంపిక చేస్తారు. జనవరి 15న సోమవారం నిర్వహించిన ఎన్నికలకు ముందు ఈసారి రేసులో ఉన్నట్లు, అమెరికాకు ఆశాదీపంగా కనిపించిన భారత సంతతికి చెందిన వివేక్‌రామస్వామి ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘ఈ రాత్రికి నేను మీ ఓటును అడుగుతున్నాను, ఎందుకంటే ఇది మన దేశానికి సరైనదని నేను నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశాడు. ‘తన ప్రత్యర్థుల ‘ఉచ్చులో‘ పడవద్దని ఓటర్లను హెచ్చరించారు. తన ప్రత్యర్థులైన ట్రంప్, నిక్కీహేలీలను ఓడించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ఎంచుకున్నాడు. ‘నేను ట్రంప్‌ను అడుగడుగునా సమర్థించాను. అతనిని అపారంగా గౌరవిస్తాను. కానీ ఇప్పుడు ఆయన ఉచ్చులో పడొద్దు’అని పోస్టు చేశాడు. అంతేకాకుండా ‘తోలుబొమ్మల మాస్టర్లు నిశ్శబ్దంగా నిక్కీని అధికారంలోకి తీసుకురావడం చూడలేం’ అని రామస్వామి జోడించారు.
ఇంటర్వ్యూలో కూడా..
సోమవారం ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తనపై చేసిన క్రూరమైన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘సరే, నేను ఎక్కడికీ విసిరివేయబడలేదు, కానీ అలా చేయడానికి ఒక ప్రయత్నం జరిగి ఉండవచ్చని నేను భావిస్తున్నాను’ అని అతను చెప్పాడు. ‘నేను దానిని తేలికగా తీసుకున్నాను, కాని నిజం ఏమిటంటే, ఇక్కడ నేలపై ఏమి జరుగుతుందో చూడకుండా ప్రజలు మంచులో తలలు పెట్టుకోవాలి. ప్రధాన స్రవంతి మీడియా దానిని విస్మరిస్తోందని నాకు తెలుసు, కానీ ఈ ప్రక్రియలో ఆలస్యంగా ఇక్కడ భారీ ఉప్పెన జరిగింది’ అని రామస్వామి పోస్టు చేశాడు. ఇక అమెరికన్ డ్రీమ్ గురించి వివరిస్తూ..సుదీర్ఘ సందేశంతోపాటు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌ను కూడా జోడించి ఎక్స్‌లో పోస్టు చేశాడు.
తొలి ఎన్నికల్లో ట్రంప్ ఆధిక్యం..
రామస్వామి ఇంత ప్రచారం చేసినా.. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎన్నికల కోసం చేపట్టిన తలి సన్నాహక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న రామస్వామి వెనుకంజలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నాడు. ట్రంప్‌పై నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ రిపబ్లికన్ పార్టీ ట్రంప్‌పైనే విశ్వాసం ఉంచింది. అందుకు తగినట్లుగా అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికల్లో ట్రంప్ భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 52.8 శాతం ఓట్లు పోలయ్యాయి. బరిలో నిలిచిన రాన్ ఢీశాంటీస్‌కు 21.4 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, భాతర సంతతికి చెందిన నిక్కీ హేలీ 17.5, వివేక్ రామస్వామి కేవలం 7.2 శాతం ఓట్లతో మూడు, నాలుగో స్థానంలో ఉన్నారు. దీంతో మూడోసారి ట్రంప్ పోటీలో నిలవడం ఖాయమైనట్టే. 2016 ట్రంప్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి బరిలో దిగబోతున్నారు.
ఎంత రచ్చచేసినా.. మళ్లీ ట్రంప్ ఎందుకంటే?
అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో ఎంత రచ్చ చేసినా కూడా మళ్లీ రిపబ్లికన్లు, ప్రజలు మెజార్టీ ట్రంప్ వైపే చూస్తుండడం విశేషం. ఆయనపై కేసులను పట్టించుకోవడం లేదు. బలమైన నాయకుడు, నాయకత్వం , ఓటమిని ఒప్పుకోని తత్త్వం ట్రంప్ సొంతం. అందుకే ఆయనకు ఎన్ని అవలక్షణాలున్నా ‘అమెరికాన్ ఫస్ట్’ అనే ట్రంప్ వైపే అక్కడి ప్రజలు మొగ్గు చూపుతుండడం విశేషం..