https://oktelugu.com/

ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రంప్ ఈసారి ర్యాపిడ్ విధానంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ విధానంలో పరీక్ష నిమిషంలోనే పూర్తవుతుంది. పావుగంటలో ఫలితం వస్తుంది. ఇది ఎంతో బాగుందని, చాలా సులభతరమని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తొలిసారి గత నెల రెండోవారంలో ఇన్వాసిస్ పద్ధతిలో కరోనా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 3, 2020 11:40 am
    Follow us on


    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రంప్ ఈసారి ర్యాపిడ్ విధానంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ విధానంలో పరీక్ష నిమిషంలోనే పూర్తవుతుంది. పావుగంటలో ఫలితం వస్తుంది. ఇది ఎంతో బాగుందని, చాలా సులభతరమని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తొలిసారి గత నెల రెండోవారంలో ఇన్వాసిస్ పద్ధతిలో కరోనా పరీక్షలు చేయించుకోగా రిపోర్టు కోసం పది గంటలు వేచి చూశారు.

    దీంతో ఈసారి ఇన్వాసిస్ పద్ధతిలో చేయించుకుని పావుగంటలోనే రిపోర్టు అందుకున్నారు. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. చైనాను మించి ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది కరోనా బాధితులు ఉన్న దేశంగా పరిణమించిన నేపథ్యంలో అక్కడి నాయకులు ఈ వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ దేశంలో ఇప్పటి వరకు 2,36,221 మంది కరోనా భారిన పడగా, 5, 780 మంది మృతి చెందారు. సుమారు రోజుకు 20 వేల మందికిపైగా వైరస్ భారిన పడుతున్నారు.