బెజవాడ వేదికగా వైసీపీలో కుమ్ములాటలు తెరమీదకు వస్తున్నాయి. రోజుకో రగడ కనిపిస్తోంది. పాలన మీద దృష్టికంటే ఎక్కువ ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుపైనే దృష్టి సారిస్తున్నారు. మంత్రిపై ఎమ్మెల్యే ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నం వివాదాలకు దారితీస్తోందిజ ఇప్పుడు మరో కొత్త రగడ తెరమీదికి వచ్చింది.
Also Read: హైఅలెర్ట్: బ్రిటన్ లో డేంజర్ కరోనా.. భారత్ కు వచ్చేసింది
గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు కమ్మ నేతలకు జగన్ అవకాశం ఇచ్చారు. వీరిలో ఒకరు తూర్పు నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ కాగా, మరొకరు గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన భవకుమార్. ఈయనకు విజయవాడ వైసీపీ వ్యవహారాల బాధ్యతలు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఇక్కడ నుంచి పోటీ చేయాలనే విషయం ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా చిచ్చు పెడుతూనే ఉంది. తానే తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్నాను కాబట్టి తనకే టికెట్ అని అవినాష్.. గతంలో స్వల్ప తేడాతో ఓడాను కనుక తనకే మళ్లీ అవకాశం ఇస్తారంటూ భవకుమార్ ప్రకటించుకుంటున్నారు.
మరోవైపు.. అవినాష్ దూకుడుగా నియోజకవర్గం పరిధిలోని ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, బొప్పన కూడా తూర్పులో యాక్టివిటీ పెంచారు. దీంతో మొన్నటి వరకు బాగానే ఉన్న ఇద్దరి మధ్య రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా దేవినేని వర్గం భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. విజయవాడ బస్టాండు, బెంజిసర్కిల్.. తూర్పు నియోజకవర్గంలో వీటిని భారీగా ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం నగర అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవ కుమార్ ఫొటోను కూడా ఫ్లెక్సీపై ముద్రించాలి.
Also Read: సౌదీ సంచలనం.. ప్రపంచంతో సంబంధాలు కట్..!
కానీ.. దేవినేని అవినాష్ వర్గం మాత్రం సీఎం జగన్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఫొటోలతోపాటు అవినాష్ చిత్రాన్ని భారీగా ముద్రించి.. బొప్పన భవకుమార్ ఫొటోను విస్మరించారు. దీంతో భవకుమార్ వర్గం అగ్గిమీద గుగ్గిలమైంది. పోటీగా భవకుమార్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. ఒక నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వ్యవహరించాలో తెలియక తల పట్టుకుంటోంది. ఎన్నికలకు మూడేళ్ల ముందే ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్