Site icon OkTelugu

Gautham Krishna: మహేష్ బాబు చేసిన సినిమాల్లో తన కొడుకు గౌతమ్ కృష్ణ కి నచ్చని సినిమాలు ఇవేనా..?

Gautham Krishna Debut

Gautham Krishna Debut

Gautham Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన సినిమాలు అతనికి ప్రేక్షకుల్లో ఎనలేని గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. గతంలో మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన ఎలాగైనా సరే ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో తన కొడుకైన గౌతమ్ కృష్ణకి కొన్ని సినిమాలంటే అసలు నచ్చవట…

ఆ సినిమాలేంటి అంటే మహేష్ బాబు ఎస్ జే సూర్య దర్శకత్వంలో చేసిన ‘నాని’ సినిమా ఒకటి కాగా, మరొకటి బి గోపాల్ దర్శకత్వంలో మహేష్ బాబు నమ్రత కలిసి చేసిన ‘వంశీ’ సినిమా కావడం విశేషం… మహేష్ బాబు కెరియర్ లో చేసిన అన్ని సినిమాల్లో ఈ రెండు సినిమాలంటే అతనికి అస్సలు నచ్చవట.

ఆ సినిమాలు టీవీ లో వచ్చిన కూడా తను చూడడానికి ఆసక్తి చూపించాడని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు… మిగిలిన సినిమాలు కొన్ని ప్లాప్ అయినప్పటికి అందులో మహేష్ బాబు యాక్టింగ్ కానీ, ఆయన లుక్స్ చాలా అద్భుతంగా ఉంటాయని చెబుతాడట. ఈ రెండు సినిమాలలో గౌతమ్ కి మహేష్ బాబు యాక్టింగ్ అసలు నచ్చలేదట. అందుకే ఆ మూవీస్ తనకి పెద్దగా నచ్చని తరచుగా చెబుతుంటారట.

ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు నట వారసుడిగా మరికొద్ది సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న గౌతమ్ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోల్లో ఒకరు కావడం విశేషం… దాంతో ఆయన రేంజ్ ని మరోసారి ప్రేక్షకులకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న వారణాసి సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

Exit mobile version