AP New Districts: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిట్టుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని భావించిన ప్రభుత్వం తానే గోతిలో పడింది. అన్ని జిల్లాల్లో సొంత పార్టీ కార్యకర్తలే రోడ్డు ఎక్కుతున్నారు. వైసీపీ నిర్వాకంతో గొడవకు దిగుతున్నారు. తమ అభిప్రాయాలను గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నూతన జిల్లాల ఏర్పాటు వ్యవహారం కాస్త లొల్లిగా మారుతోంది. అన్ని చోట్ల వైసీపీ నేతలు పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. పక్షపాత ధోరణితోనే ప్రభుత్వం ఇలా చేస్తుందని విమర్శలు చేస్తున్నారు. దీంతో సీఎం జగన్ కు నిద్ర పట్టడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. నేతలను ఎలా సముదాయించాలో అర్థం కావడం లేదు.
సీఎం సొంత జిల్లా కడపలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ ఉన్నా రాయచోటిని చేశారు. దీంతో వైసీపీ నేతల్లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో వారు గొడవలు చేస్తున్నారు దీంతో వైసీపీ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ఏం చేసినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. దీంతో వైసీపీ నేతల్లో సహనం నశించిపోతోంది. వైసీపీ నేతల ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు మౌనంగానే ఉన్నా వైసీపీ నేతలే లొల్లి రాజేస్తున్నారు. ఈ క్రమంలో గొడవలు సద్దుమణిగేలా ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెడుతున్నారు. పార్టీ రువు పోకుండా కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారు.
మొదట్లో టీడీపీ నుంచి విమర్శలు వస్తాయని భావించినా వారు కామ్ గానే ఉన్నారు. కానీ సొంత పార్టీ నేతలు కుంపటి రాజేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకోవాలని చూసినా తానే టార్గెట్ అయిపోతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో నిరసనలే పెరుగుతున్నాయి. సీఎంపై గుస్సా వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఎం నిర్ణయాలను అందరు తప్పుబడుతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధానాలు అవసరం లేదని తెగేసి చెబుతున్నారు.
Also Read: తగ్గేదే లే అంటూనే తగ్గిన ఉద్యోగులు.. ప్రభుత్వంతో చర్చలకు జై..
పార్టీ నేతల్లో ఉన్న ఆధిపత్య పోరుతోనే రోడ్డు మీదకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు మాత్రం ఎక్కువగా స్పందించడం లేదు. దీంతో ప్రతిపక్షం సైతం నిశితంగా పరిశీలిస్తోంది. వైసీపీ నేతల తీరుపై ఏం మాట్లాడకుండా ఉంటోంది. కానీ సొంత పార్టీలోనే నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో వైసీపీ ఇబ్బందుల్లో పడిపోతోంది. మింగలేక కక్కలేక అన్న సామెత మాదిరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీన్ని ప్రతిపక్షం కూడా క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది.
దీంతో ఏపీలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికార పార్టీ విధానాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగినట్లు అయింది. టీడీపీ ఏదో షాకిద్దామని అనుకున్నా చివరకు తనకే షాక్ తగలడంతో డైలమాలో పడుతోంది. సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయలేక సతమతమవుతోంది. భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే ఆందోళన అందరిలో నెలకొంది.
Also Read: టీచర్లు, ప్రభుత్వం మధ్య ఫైట్