https://oktelugu.com/

టీఆర్‌‌ఎస్‌ కూడా ఆ సామాజిక వర్గానికే టికెట్‌ ఇస్తుందా..?

నాగార్జున సాగర్‌‌ బైపోల్‌లో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీల క్యాండిడేట్ల లిస్ట్‌ దాదాపుగా ఫైనల్‌ అయింది. కానీ.. ఇంకా అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ మాత్రం ఎటూ తేల్చడం లేదు. నామినేషన్లు వేయడానికి ఒక్కరోజే ఉంది. కానీ.. ఇంకా గులాబీ పార్టీ అభ్యర్థి మాత్రం ఖరారు కాలేదు. పార్టీ అధినేత అభ్యర్థి పేరును ప్రకటించి.. ఆయన నామినేషన్‌ వేయాల్సి ఉంది. అందరికంటే.. ముందుగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా జానారెడ్డిని ఎంపిక చేసింది. ఆయన తన గెలుపు కోసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 27, 2021 3:57 pm
    Follow us on

    TRS
    నాగార్జున సాగర్‌‌ బైపోల్‌లో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీల క్యాండిడేట్ల లిస్ట్‌ దాదాపుగా ఫైనల్‌ అయింది. కానీ.. ఇంకా అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ మాత్రం ఎటూ తేల్చడం లేదు. నామినేషన్లు వేయడానికి ఒక్కరోజే ఉంది. కానీ.. ఇంకా గులాబీ పార్టీ అభ్యర్థి మాత్రం ఖరారు కాలేదు. పార్టీ అధినేత అభ్యర్థి పేరును ప్రకటించి.. ఆయన నామినేషన్‌ వేయాల్సి ఉంది.

    అందరికంటే.. ముందుగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా జానారెడ్డిని ఎంపిక చేసింది. ఆయన తన గెలుపు కోసం టీపీసీసీ అధ్యక్ష పదవిని కూడా ప్రకటించకుండా చేశాడు. ఇక బీజేపీ, టీఆర్ఎస్ ఇంతకాలం తమ అభ్యర్థులను ప్రటించకపోవడానికి కారణం ఎవరు ముందు ప్రకటిస్తే వాళ్ల అభ్యర్థిని చూసి ఇతర పార్టీలు ప్రకటిస్తుంటాయి. అభ్యర్థుల ఎంపికకు ప్రధానంగా కులాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. అందుకే.. ఓ పార్టీ క్యాండిడేట్‌ను ప్రకటించాక.. అదే కులానికి చెందిన క్యాండిడేట్‌ను ఈ పార్టీలు ప్రకటిస్తుంటాయి. ఇలాంటి లెక్కల కోసమే బీజేపీ, టీఆర్ఎస్ వెయిట్ చేశాయి. ఇక చివరి క్షణంలో బీజేపీ నివేదితా రెడ్డి పేరు ప్రకటించింది.

    వాస్తవానికి ఈమె పేరు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. గత ఎన్నికల్లో ఈమె బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయింది. పార్టీ తనకే టిక్కెట్ ఇస్తుందనే నమ్మకంతో ఈమె అనధికారికంగా ప్రచారం చేసుకుంటూనే ఉంది. కానీ.. బీజేపీ, టీఆర్ఎస్ నిర్ణయం కోసం ఇంతకాలం ఎదురు చూసింది. సేమ్ టీఆర్ఎస్స్ పరిస్థితి కూడా ఇదే.

    సాధారణంగా ఇలా అకాల మరణం కారణంగా ఉపఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీ సానుభూతి మీద ఆధారపడుతుంది. అందుకే మరణించిన ఎమ్మెల్యే కుటుంబం నుంచే ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారు. కానీ.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవ్వలేదు. అందుకే సాగర్‌‌లో ఆ ప్రయోగం చేయలేదు. నరసింహయ్య పాపులర్ నాయకుడు కాబట్టి ఆయన కుటుంబంలో నుంచే ఎవరికైనా టిక్కెట్ ఇవ్వొచ్చు. అలా ఇచ్చి ఉంటే ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది. కానీ.. బీజేపీ చేతిలో ఓడిపోతామేమోననే భయం కేసీఆర్‌‌లో ఇంకా కనిపిస్తోంది. అందుకే బీజేపీ అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూసింది. సో.. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి.. బీజేపీ అభ్యర్థి రెడ్డి.. మరి టీఆర్ఎస్ కూడా రెడ్డినే బరిలోకి దింపుతుందేమో చూడాలి.