AP Employees: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు తీపి కబురు అందనుంది. ఉద్యోగులకు అందించే ఫిట్ మెంట్ విషయం కాస్త బయటకు వచ్చింది. గుట్టుగా ఉండాల్సిన విషయం ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ ఉద్యోగుల చెవిన పడింది. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 34 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ సర్కారు సిద్ధమైందని తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల వేతనాలు ఏఢు శాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కంటే మెరుగైన ఫిట్ మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

అయితే పీఆర్సీ నివేదికను ఉద్యోగులతో చర్చించి బయట పెట్టాల్సి ఉన్నా రహస్యంగా ఉద్యోగులకు లీకు కావడంతో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పీఆర్సీ నివేదిక బయటకు రాకుండానే ఫిట్ మెంట్ విషయం కాస్త బయటకు తెలియడంతో ఉద్యోగులు ఏ మేరకు స్పందిస్తారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులు సైతం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ర్టంలో ఉద్యోగులు పీఆర్సీ ప్రకటించాలని కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగుల్లో సహనం నశించి ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమైన పరిస్థితుల్లో పీఆర్సీ నివేదిక త్వరలో బయటకు రానుండటంతో వారి ఆశలు నెరవేరేలా ఉన్నాయని సమాచారం. దీంతో ప్రభుత్వంపై మంచి అభిప్రాయమే ఉద్యోగుల్లో కలగనుంది.
Also Read: Andhra Pradesh: కేంద్రంపై మరో ఉద్యమానికి ఆంధ్రుల రెడీ
మరోవైపు దాదాపు 71 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినా అందులో ఎన్ని తీర్చారో తెలియడం లేదు. దీంతో ఉద్యోగులు కోరుతున్న ప్రధాన డిమాండ్లలో కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు, ఉద్యోగులకు జీవిత బీమా తదితర డిమాండ్లు ప్రధానమైనవిగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఎన్నింటిని తీర్చనుందో తెలియడం లేదు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించనుందని తెలుస్తోంది.
Also Read: Telugu states: తెలుగు స్టేట్లలో మొదలైన ఎన్నికల సందడి