Passport: పాస్పోర్ట్.. విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఆయా దేశాలు అందించే అధికారిక ధ్రువీకరణ. ఆయా దేశాలకు ఉన్న పరపతి ఆధారంగా పాస్పోర్ట్ కు విలువ ఉంటుంది. పాస్పోర్ట్ ఉంటేనే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొన్ని దేశాలకు పాస్పోర్ట్ అవసరం లేకుండానే వెళ్ళొచ్చు.
పాస్పోర్ట్ ను నిర్ణీత సమయంలో గా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.. సంబంధిత కార్యాలయాలకు వెళ్లి మన పాస్పోర్ట్ సమర్పిస్తే.. అక్కడి అధికారులు అని ఆధారాలు పరిశీలించి ఆ తర్వాత పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తారు. అయితే కేరళ రాష్ట్రంలో అక్కడి పాస్పోర్ట్ అధికారులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురయింది.. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కింది. చివరికి సంచలనంగా మారి చర్చకు దారితీస్తోంది.
కేరళ రాష్ట్రంలో అత్యధికంగా అక్షరాస్యత రేటు ఉంటుంది. ఇక్కడి ప్రజలు అరబ్ దేశాలకు వెళ్తుంటారు. అక్కడ వివిధ సంస్థల్లో పని చేస్తూ ఉపాధి పొందుతుంటారు. హెల్త్ కేర్ నుంచి జ్యువెలరీ వరకు అన్ని రంగాలలో కేరళ రాష్ట్ర వాసులు అరబ్ దేశాలలో పనిచేస్తుంటారు..వివిధ దేశాలకు వెళ్లేవారు నిర్ణీత సమయాల్లో తమ పాస్పోర్టు రెన్యువల్ చేస్తుంటారు..
ఇలా కేరళ రాష్ట్రంలో తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం ఓ మహిళ వెళ్లింది.. ఆమె పాస్పోర్ట్ పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే ఆమె తన ట్రావెల్ హిస్టరీ కి బదులుగా వ్యక్తిగత ఖర్చులు.. ఫోన్ నెంబర్లతో ఆ పేజీలను నింపేసింది. దీంతో పాస్పోర్ట్ ఆఫీసులో పని చేసే అధికారులు ఒక్కసారిగా ఆ మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేడం మేము ఇచ్చింది పాస్పోర్ట్. డైరీ కాదు. ఆయన పాస్పోర్ట్ వాడాల్సింది ఇలా కాదు. మీరు ఇలాంటి లెక్కలు రాయడానికి పాస్పోర్ట్ ఇవ్వలేదు. కాస్తయినా మీకు అర్థం అవ్వాలి కదా” అంటూ సిబ్బంది ఆ మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి పాస్పోర్ట్ మీద ఇలా రాస్తే చెల్లుబాటు కాదని అధికారులు చెబుతున్నారు. అయితే ఆమె వయసును దృష్టిలో పెట్టుకొని వారు పాస్పోర్ట్ రెన్యువల్ చేశారని కేరళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనపటికి ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
“Kerala में पासपोर्ट रिन्यू कराने आई महिला ने सबको हिला दिया — जब पता चला कि मैडम ने अपना पासपोर्ट डायरी की तरह इस्तेमाल किया था.
अंदर हिसाब-किताब, फोन नंबर, नोट्स, खर्चों की लिस्ट… पूरा ‘जीवन चरित्र’ लिखा हुआ था.
— Basant Khedia (@Basant_Khedia) November 15, 2025