Telangana Elections 2023: ఈవీఎంలో ఎవరి గుర్తులు ముందుంటాయో తెలుసా?

ఎన్నికల్లో ప్రధాన పుట్టం నామినేషన్‌ ప్రక్రియ. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్ధులకు గుర్తులు కేటాయించారు. ఈ గుర్తుల కేటాయింపు.

Written By: Raj Shekar, Updated On : November 29, 2023 6:27 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే అభ్యర్థులు డమ్మీ ఈవీఎంలతో విస్తృతంగ్రా ప్రచారం చేశారు. తమ గుర్తు ఎన్నో నంబర్‌పై ఉందో అవగాహన కల్పించారు. కానీ, పత్రికల్లో రెండు రోజులుగా వస్తున్న ప్రకటనలు ఓటర్లను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాయి. కొన్ని ఈవీఎంలలో జాతీయ పార్టీల అభ్యర్థి గుర్తు ముందు ఉంటే.. మరికొన్ని ఈవీఎంలలో ప్రాంతీయ పార్టీల అభ్యర్థి గుర్తు ముందు ఉన్నాయి. దీంతో అసలు ఈవీఎంలలో ఎవరి గుర్తులు ఎక్కడ ఉంటాయి. వేర్వేరుగా ఉండడానికి కారణం ఏంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చదువుకున్న వారు కూడా కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు.

గుర్తులు ఇలా..
ఎన్నికల్లో ప్రధాన పుట్టం నామినేషన్‌ ప్రక్రియ. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్ధులకు గుర్తులు కేటాయించారు. ఈ గుర్తుల కేటాయింపు. ఈవీఎంలో వివిధ పార్టీల అభ్యర్ధుల కూర్పు ఎలా ఉంటుందన్నది చాలా మందికి తెలియదు. ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల గుర్తులే సంబంధిత అభ్యర్ధులకు ఉంటాయి. రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం.. నామినేషన్‌ దాఖలు సమయంలో ప్రాధాన్య క్రమంగా ఎంచుకున్న వాటిని కేటాయిస్తారు. అభ్యర్ధుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నామినేషన్‌లో కోరిన వాటిని సూచిస్తూ గుర్తులు కేటాయిస్తారు. వీటిలోనూ ఒకే గుర్తును ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు ఎంచుకుంటే లక్కీ డ్రా విధానం అనుసరిస్తారు.

ఈవీఎంలో కూర్పు ఇలా..
• ఈవీఎం (బ్యాలెట్ యూనిట్)లో అభ్యర్థుల వరుస క్రమాన్ని. సామపత్రంలో రాసిన పేర్ల తెలుగు అక్షరమాల ప్రకారం కేటాయిస్తారు. ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన జాతీయ. ప్రాంతీయ పార్టీల అభ్యర్థులవి మొదటి వరుసలో… రిజిస్టర్ చేసుకున్న, స్వతంత్ర అభ్యర్థులని తదుపరి వరుస క్రమంలో కేటాయిస్తారు.

– తొలుత గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులను ఎంచుకుంటారు. నామినేషన్ పత్రాల్లో తమ పేరు, ఇంటి పేరు నమోదు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి.

– అందుకే నామినేషన్లతోపాటు బ్యాలెట్లో అభ్యర్థి పేరు ఎలా ఉండాలని కోరుకుంటారో.. ప్రత్యేకంగా రాసి ఇవ్వాలని సూచిస్తారు. ఇదే బాలెట్లో సదరు అభ్యర్థికి చోటు కేటాయించేందుకు అధికారులకు ఆధారం.

• – అభ్యర్థుల ప్రాధాన్య క్రమాన్ని నిర్ధారించేందుకు మొదట జాతీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తారు.

– వారిచ్చిన పేరులో మొదటి అక్షరాలను పరిశీలించి, తెలుగు వర్ణమాల(పెద్ద బాలశిక్ష)లోని అక్షరాలు, గుణింతల ఆధారంగా వరుస క్రమాన్ని నిర్ధారిస్తారు.

• జాతీయ పార్టీల అభ్యర్థులను గుర్తించి వారికి వరుస సంబరు కేటాయించిన అనంతరం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ అభ్యర్థులను నమోదు చేస్తారు.

– ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్ర పార్టీల అభ్యర్థులుంటే వారికిచ్చిన పేరు వివరాలతో తెలుగు వర్ణమాలను అనుసరించి వరుసలో కేటాయిస్తారు.

గురువారం ఉదయం ఓటు వేయనున్న ప్రజలు తాము ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారో.. ఆ అభ్యర్థి గుర్తును ఈవీఎంలో సరిగ్గా చూసుకుని ఓటు వేయడం ద్వారా తాము వేసిన ఓటుకు విలువ ఉండే అవకాశం ఉంటుంది. గుర్తు సరిగా లేదని, ఏదో ఒక గుర్తుకు వేస్తే ప్రయోజనం ఉండదు.