Homeఅంతర్జాతీయంIndia-China: భారత్ చైనా ను ఢీకొట్టాలంటే ఏం చేయాలో తెలుసా

India-China: భారత్ చైనా ను ఢీకొట్టాలంటే ఏం చేయాలో తెలుసా

India-China: మనం ప్రతీ దానికి చైనాను ఆడిపోసుకుంటాం గానీ..దానితో పోటీ పడితే ఏం జరుగుద్దో ఆలోచించం. “టిక్ టాక్” కు పోటీగా ఇన్నాళ్లకు గానీ “చింగారీ”ని తీసుకురాలేక పోయాం. ధాన్యం దిగుబడిలో డ్రాగన్ 60 బస్తాలు దాటితే..మనం ఇంకా ముక్కీమూలిగి 40 దగ్గరే ఆగిపోయాం. చైనాతో పోలిస్తే మన ఆదాయం తక్కువ, వ్యయం చాలా ఎక్కువ. అధికారం కోసం ప్రభుత్వాలు పఠిస్తున్న సంక్షేమ మంత్రంతో మిగులుతోంది హల్లికి హల్లి సున్నాకు సున్నా.

India-China
modi, Xi Jinping

మనదేశ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు తలసరి జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి)లో నాలుగున్నరరెట్లు ఉంటుంది. అదే చైనాలో ఒకటిన్నర రెట్లు. పరిశోధన, అభివృద్ది రంగంలో మనం చేస్తున్న వ్యయం జీడీపీలో 0.7 శాతమే. నమ్మబుల్ గా లేకున్నా ఇదే నిజం. మనకంటే ఎంతో చిన్నవైన ఇజ్రాయల్, దక్షిణ కొరియా 4.6 శాతం ఖర్చు చేస్తున్నాయి. చైనా 2.1 శాతం ఖర్చు చేస్తూ మనకంటే ఎన్నో ఆకుల పైన ఉంది. చైనా జీడీపీ మనకంటే ఎక్కువ గనుక పరిశోధన, అభివృద్ది రంగంలో ఆ దేశం వెచ్చిస్తున్న మొత్తం మనం చేస్తున్న వ్యయం కంటే 15 రెట్లు ఎక్కువ.

Also Read: Chandrababu Naidu: చంద్రబాబు పార్టీ నడవడానికి కోట్లు ఇస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరో తెలుసా?

అమెరికాకు మింగుడు పడటం లేదు

మనదేశం ఆయా రంగాల్లో ముఖ్యంగా కీలకమైన వాటిల్లో సత్తా చాటకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి.
ఐటీలో మనం మేటి అనుకుంటాం గానీ వినూత్న సాంకేతికతల అభివృద్దిలో చైనా అగ్రగామిగా ఉంది. ఏకంగా టెక్నాలజీ గురుగా అవతరించింది..ఇదిగో ఇదే ఆ అమెరికాకు మింగుడు పడటం లేదు. ఎన్నో ఏళ్ళ నుంచి వ్యాపార బుద్దితో, గిట్టని వాళ్లను తొక్కేసి అమెరికా ప్రపంచం మీద పెత్తనం చెలాయిస్తోంది. ఓ ఇరాన్, ఇరాక్, జపాన్, అప్ఘానిస్తాన్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. ఇది ఇక్కడ కట్ చేస్తే.. రెండేళ్ల క్రితం కేంద్రం చైనా యాప్ లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఇక్కడ వేరే లెక్కలున్నాయి..అంతకు మించి చిక్కుముళ్లున్నాయి.
ఉదాహరణకు “ఓలా”నే తీసుకుంటే..ఇందులో చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా వచ్చిన లాభాలను వారి దేశానికే తరలిస్తాయి. ఇప్పుడు సర్కారు చైనా సంస్థల పెట్టుబడులపై నిషేధం విధిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. పైగా ఏ సమస్యా పరిష్కారం కాదు. చైనా నుంచి పెట్టుబడులు స్వీకరించాలి. ప్రపంచమే ఒక వ్యాపార విపణి అయిన తర్వాత ఈ కట్టుబాట్లు, నిషేధాజ్నలు ఎక్కువ కాలం పనిచేయవు. చైనా డబ్బులు కావాలి..అంతకముందే ఇక్కడి మదుపర్లు బలవంతం అవ్వాలి..ఓ మాల్యా, చోక్సీ లాంటి వాళ్లకు రుణాలు ఇచ్చే బ్యాంకులు తమ ఉదారతను ఔత్సాహికులపై చాటుకోవాలి. చైనా లో మాత్రం జెల్లలు, డొల్లలు లేవా అంటే ఉన్నాయి. కానీ వారు అందిపుచ్చుకునే అవకాశాలు వెలుగులోకి రాకుండా చేస్తున్నాయి.

ఉత్పత్తిని పెంచాలి

2002లో చైనా ప్రభుత్వం పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం అవసరమైన టర్భైన్ ల కోసం ఓపెన్ బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించింది. ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెంచడమే దీని లక్ష్యం. కానీ జరిగింది వేరు. విదేశాల నుంచి టర్బైన్ ల దిగుమతులు పోటెత్తాయి. కానీ ఇక్కడే డ్రాగన్ ఒక మెలిక పెట్టింది. ఆయా సంస్థలు తాము ఉపయోగించుకునే 70 శాతం విడిభాగాలు తమ దేశంలో తయారయినవై ఉండాలని నిర్మొహమాటంగా చెప్పింది. కానీ 2009 నాటికి ప్రపంచంలోనే ఆరు అగ్రశ్రేణి పవన విద్యుత్ టర్భైన్ లు తయారు చేసే సంస్థలను తయారు చేసుకుంది. అదే మన దేశంలో అయితే ఇలా ఉండేదా? ఒకవేళ సర్కారు నిర్ణయం తీసుకున్నా కార్పొరేట్ కంపెనీలు ఊరుకునేవా?

India-China
India-China

అంతెందుకు దేశంలో ఆటోమోబైల్ పరికరాల తయారీ చాలా వ్యయంతో కూడుకున్నది..ఈ భారం ఎలాగూ వినియోగదారులే భరించాలి కనుక వాహనాలు నానాటికీ ప్రియం అవుతున్నాయి. చైనా నుంచి ఆటోమోబైల్ పరికరాల దిగుమతి నిలిపేసిన పక్షంలో కంపెనీలు దేశీయంగా తయారైన ఖరీదయిన పరికరాలనే కొనాల్సి ఉంటుంది. ఇందుకు ఒక్కటే మార్గం విడి భాగాలకు అత్యాధునిక సాంకేతికతను జోడించడం. అలా కుదరని పక్షంలో ఖరీదయిన దేశీయ విడిభాగాలే శరణ్యం. చైనాతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలా వద్దా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు..అది తర్కానికి కూడా అందదు. ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా తగ్గించుకుని, నాణ్యమైన సరుకులను ఉత్పత్తి చేస్తేనే మనం లబ్ధి పొందగలం. చైనా ఇలా చేసింది కనుక ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న ఎలన్ మస్క్ భారత్లో ప్లాంట్ పెడతానంటే మోదీ ఒప్పుకోలేదు. ఇందుకు కారణం అమెరికాలో తయారైన వాహనాలను ఇక్కడి ప్లాంట్ ద్వారా విక్రయిస్తుండటమే. అన్ని రైతులు ఇస్తాము ఇక్కడే వాహనాలు తయారుచేసి విక్రయించాలని మోడీ కోరడంతో ఇంతవరకు స్పందించలేదు. తీసుకున్న ఈ నిర్ణయం ఫలితంగా దేశీయ సంస్థలైన టీవీఎస్, బజాజ్, హీరో ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీని ప్రారంభించాయి. ఇప్పటికే కొన్ని కొన్ని మోడళ్ళను బయటకు తీసుకొచ్చాయి. కొన్ని విషయాల్లో ప్రభుత్వం కఠినంగా ఉంటే ఏం జరుగుతుందో మోడీ తీసుకున్న నిర్ణయమే ప్రబల ఉదాహరణ.

విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులు జరగాలి

సాంకేతికంగా మనం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందకపోవడానికి మన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లో భ్రష్ట పరిస్థితులు. అవి డిగ్రీలు, డాక్టరేట్లు ఇవ్వడానికి తప్ప దేనికీ పనికి రావడం లేదు. ఇక విద్యార్థి సంఘాల గోల సరేసరి. వీరి ఆధిపత్య మంటల్లో పార్టీలు చలికాచుకుంటున్నాయి. అమెరికా అభివృద్దిలో అక్కడి యూనివర్సిటీల పాత్ర అనన్య సామాన్యం. చైనాలో కూడా యూనివర్సిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మనం ఇప్పటికైనా మేల్కొని ఈ పరిస్థితిని మార్చి వేయాల్సి ఉంది. సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల గొంతెమ్మ కోరికలను తీర్చడం మానేసి పరిశోధన, అభివృద్ది రంగాల్లో వ్యయాలను ఇతోధికంగా పెంచాలి. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు మరింత జవాబుదారీతనంతో వ్యవరించేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. అవి జరిగినప్పుడే కొత్త సాంకేతికతల అభివృద్దిలో భారత్ చైనాను అధిగ మించగలదు.

Also Read:BJP Big Strategy: బీజేపీ భారీ వ్యూహం.. రాష్ట్రాల కమ్యూనిటీలతో సమావేశం

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular